233 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఎంసీసీ అధినేతగా మహిళ !

0

క్రికెట్ నిబంధనల తయారీ సంస్థ మెర్ల్బోన్ క్రికెట్ క్లబ్ చరిత్రలో తొలిసారి ఓ మహిళ అధ్యక్ష పీఠాన్ని అధిష్టించనుంది. ఈ ఎంసీసీ ప్రారంభమై ఇప్పటికి 233 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు ఏ మహిళ కూడా అధ్యక్షురాలిగా ఎంపిక కాలేదు. తొలిసారిగా ఒక మహిళ అధిష్టించబోతున్నారు. ఆమె ఇంగ్లండ్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ క్లేర్ కానర్. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర వచ్చే ఏడాది పదవి నుంచి దిగిపోయిన తర్వాత కానర్ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.

అయితే క్లేర్ కానర్ ఈ పదవిలో రావటానికి ఏడాదికి పైగా వేచి ఉండాలి. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న కుమార సంగక్కర స్థానంలో కానర్ వచ్చే ఏడాది అక్టోబర్ నెలలో నియమితులవుతారు. కుమార సంగక్కర స్వయంగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) లో మహిళల క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న క్లేర్ కానర్ను నామినేట్ చేసారు. బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో.. కానర్ ఎంసీసీ అధ్యక్ష పదవిని చేపడుతారని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించారు.

వచ్చే ఏడాది అక్టోబర్ 1న కానర్ ఈ పదవిని చేపట్టనున్నారు. అయితే దీనికి ముందు ఆమె మెర్ల్బోన్ క్రికెట్ క్లబ్ సభ్యుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఎంసీసీ అధ్యక్షుడిగా కుమార సంగక్కర పదవీకాలం ఈ సంవత్సరంతో ముగిసింది. అయితే ఈ వైరస్ మహమ్మారి కారణంగా సంగక్కర పదవీకాలం ఏడాది పాటు పొడిగించబడింది. ఈ నేపథ్యంలో ‘క్లేర్ కానర్ తదుపరి ఎంసీసీ ప్రెసిడెంట్ పదవికి నామినేట్ కావడం చాలా సంతోషంగా ఉంది. క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది. ఇప్పుడు ఈ గౌరవం కూడా పెద్ద విషయం’ అని సంగక్కర తెలిపారు.
Please Read Disclaimer