కేసీఆర్ మీడియాకు భయపడ్డాడబ్బా..!

0

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి ప్రత్యర్థులే కాదు.. మీడియా కూడా ఎంతగా భయపడుతుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే.. వ్యాఖ్యలు చేసే మీడియా సంస్థలే కరవైపోయాయి ఇప్పుడు. ఏదైనా పెద్ద ఇష్యూ చోటు చేసుకున్నపుడు.. ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినపుడు కనిపించినపుడు కూడా మీడియా కిక్కురుమనే పరిస్థితి లేదు. కేసీఆర్ ను నిలదీయాలన్న ఆలోచన కూడా ఎవరికీ రాదు. రెండోసారి ఎన్నికల్లో గెలిచాక మీడియా మరింత మౌనం పాటిస్తోంది. వెటర్నరీ వైద్యురాలిపై అఘాయిత్యం – హత్య ఘటనకు సంబంధించి డిప్యూటీ హోం మినిస్టర్ తీవ్ర అభ్యంతకరకర వ్యాఖ్యలు చేయగా.. ఆయన్ని మందలించేవాళ్లు లేరు. ఇంత పెద్ద ఘటన జరిగితే ముఖ్యమంత్రి దీనిపై స్పందించలేదు. దీని గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి కేసీఆర్ ను ప్రశ్నించేవాళ్లు లేరు.

ఇలాంటి సమయంలో మన మీడియా చేయాల్సిన పనిని నేషనల్ మీడియా చేయడం విశేషం. రిపబ్లిక్ ఛానెల్ హెడ్ అర్నాబ్ గోస్వామి.. రేప్ ఉదంతంపై చర్చ పెట్టి టీఆర్ ఎస్ ఎంపీ ఒకరిని ఏకి పడేశాడు. ఈ సమయంలో కేసీఆర్ నుంచి స్పందనే లేకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. మిగతా నేషనల్ ఛానెళ్లు కూడా ఈ అంశాన్ని అందిపుచ్చుకున్నాయి. ‘వేర్ ఈజ్ కేసీఆర్’ అన్న ట్యాగ్ లైన్ తో స్టోరీలు నడిపించాయి. సోషల్ మీడియాలో కూడాా ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ హ్యాష్ ట్యాగ్ మీద బోలెడన్ని ట్వీట్లు పడ్డాయి. దీంతో కేసీఆర్ లో కదలిక వచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేసును విచారణకు కేసీఆర్ ఆదేశిస్తున్నట్లు తెలంగాణ సీఎంవో ప్రకటించింది. మరోవైపు ఈ కేసు తీవ్రత – జాతీయ స్థాయిలో చర్చ జరగడం చూసి కేటీఆర్ కూడా యాక్టివ్ అయ్యారు. రేపిస్టులకు వెంటనే శిక్ష పడేలా చట్టాలు మార్చాలంటూ ప్రధానిని కోరుతూ.. ట్వీట్లు వేశారు. మొత్తానికి నేషనల్ మీడియా దెబ్బకు ఇటు కేసీఆర్ – అటు కేటీఆర్ బెదిరినట్లే కనిపిస్తోంది.
Please Read Disclaimer