కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కు వైరస్..!

0

తెలంగాణలో వైరస్ మహమ్మారి రోజురోజుకి పెరిగిపోతుంది. సామాన్యాలతో పాటుగా రాజకీయ నాయకులను వైరస్ మహమ్మారి వేధిస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు అధికార పార్టీలో పలురువు ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకగా.. తాజాగా విపక్షంలోని ఓ సీనియర్ నాయకుడు సైతం కరోనా బారిన పడ్డారని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్)కు కరోనా ఉన్నట్లు వైద్యులు నిర్ధరించారని కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రిలో చేర్చారు అని ప్రచారం జరుగుతుంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే అత్యంత సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు. ఆయన వయసు 72 ఏళ్లు. ఈ వయసులో ఆయనకు కరోనా సోకడంతో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి ఆయన ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉంచుతున్నట్లు వైరస్ లక్షణాలుగా గుర్తించి వైద్యులు ఆయనకు వైరస్ టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది అని ప్రస్తుతం వీహెచ్ అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది.

అంతకు ముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత గూడూరు నారాయణ రెడ్డికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ముగ్గురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కరోనా బారిన పడిన విషయం కూడా తెలిసిందే. ఇలా వరుసగా ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతుండటంతో మిగతా ప్రజాప్రతినిధుల్లో ఆందోళన నెలకొంది. కాగా రాష్ట్రంలో మొత్తం 7072 పాజిటివ్ కేసులు నమోదవగా.. ప్రస్తుతం 3363 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 154 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3506కు చేరింది.
Please Read Disclaimer