ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. పవన్‌పై పోటీ ఎవరంటే?

0

కాంగ్రెస్ పార్టీ ఏపీ నుంచి అసెంబ్లీ, లోక్ సభ బరిలో దిగే అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించింది. తొలి విడతలో 132 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించిన కాంగ్రెస్.. మలి విడతలో మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 22 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ.. మలి విడతలో మిగతా మూడు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. విశాఖపట్నం నుంచి పేడాడ రమణ కుమారి, విజయవాడ నుంచి నరహరిశెట్టి నరసింహారావు, నంద్యాల నుంచి లక్ష్మీ నరసింహ యాదవ్ పేర్లను ప్రకటించింది.

భీమవరం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్‌పై శేఖర్ బాబు దొరబాబు పోటీ చేయనున్నారు. రఘువీరా రెడ్డి కళ్యాణ దుర్గం నుంచి పోటీ చేస్తున్నారని తొలి జాబితాలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer