బబితా పోగాట్.. లిమిట్స్ దాటుతోందట!

0

రెజ్లింగ్ స్టార్ బబితా పోగాట్ అప్పుడే ఫక్తు రాజకీయ నాయకురాలిలా మారారు. ఆట ఆడే కోర్టు లోనే కాదు బయట కూడా తన ఉడుం పట్టు పవరేంటో చూపుతున్నారు. ఆమె ఘాటు విమర్శలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఆమె హద్దులు దాటి ప్రవస్తోందని ఆరోపిస్తున్నారు. ఇకనైనా బబితా పోగాట్ తన లిమిట్స్లో ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకూ బబితాపై కాంగ్రెస్ నేతల కోపానికి కారణం ఏంటంటే.. ఇటీవల ‘రాజీవ్ ఖేల్రత్న’ అవార్డుపై బబితా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాజీవ్గాంధీ ఏమైనా పెద్ద క్రీడాకారుడా! అయన పేరుమీద అవార్డు ఇవ్వడమేంటి? మనదేశంలో ఎందరో గొప్పగొప్ప క్రీడాకారులు ఉన్నారు. వారి మీద ఇవ్వొచ్చు కదా! రాజీవ్గాంధీ పేరుమీద ఎందుకు’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. దీంతో ఆమె మాటలపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది.

రాజీవ్ గాంధీ ఈ దేశానికి మాజీ ప్రధాని అని.. క్రీడలకు ఆయన ఎంతో సేవ చేశారని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. దేశంలోని పలుచోట్ల బబిత దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. పోస్టర్ను చెప్పులతో కొట్టారు. షోలాపూర్ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సహా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజీవ్గాంధీపైన చేసిన వ్యాఖ్యలను ఆమె వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఖేల్రత్న అవార్డు రాజీవ్ పేరిట ఉండటం పట్ల గతంలోనూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ అవార్డును ధ్యాన్చంద్ పేరిట పెడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే భారతీయ జనతా పార్టీ ప్రోద్బలంతోనే బబితా ఈ ఆరోపణలు చేశారన్న కాంగ్రెస్ విమర్శిస్తోంది.