కరోనా ఎఫెక్ట్ : మాస్క్ లతో పెళ్లి …

0

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటివరకు 127 దేశాలకు కరోనా వైరస్ సోకిందింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 4972కి చేరింది. అలాగే 1 34 558 మంది కరోనా బాధితులు ఉన్నారు. 5994 మందికి సీరియస్ గా ఉంది. ఇకపోతే ఈ కరోనా వైరస్ భారత్ లో విజృంభిస్తోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో భారత్ లోని అని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూళ్లు కాలేజీలు సినిమా థియేటర్లు మార్చి 31వ తేదీ వరకు మూసేయాలని ఆదేశాలు జారీచేశారు. ఈ కరోనా ఎఫెక్ట్ పెళ్లిళ్ల పైనా కూడా పడింది. కొందరు పెళ్లిళ్లు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు.

అయితే తాజాగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం ఓ కొత్త జంట ధైర్యం చేసి కరోనా విస్తరిస్తున్న సమయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోని పెళ్లి చేసుకున్నారు. వరుడు వధువు మాస్కులు ధరించి వివాహం చేసుకున్నారు. అలాగే ఆ ఇద్దరే కాకుండా ఆ పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆఖరికి పెళ్లి జరిపించిన పురోహితుడు కూడా మాస్క్ లు ధరించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో ఈ మాస్క్ ల పెళ్లి జరిగింది.

ఈ పెళ్ళికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ కొత్త జంట చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. కరోనాపై అందరికి అవగాహన కల్పించేలా ఉందని అభినందించారు. కరోనా వైరస్ ప్రాణాంతకం కాదని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదంటున్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం మాస్కులు ధరించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలతో కరోనాని నివారించొచ్చని చెబుతున్నారు.

ఇకపోతే భారత్ లో తొలి కరోనా మృతి నమోదైంది. కర్ణాటక వాసి హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి.. చనిపోయినట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. ఇదే భారత్ లో నమోదైన తొలి కరోనా మృతి కావడం బాధాకరం. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన వ్యక్తి మరణంతోపాటు భారత్ లో ఇప్పటివరకూ 74 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దీనికి వ్యాక్సిన్ ఇంకా కనిపెట్టలేదు. దీంతో కరోనా వైరస్ పేరు చెప్తేనే అందరూ భయంతో వణికిపోతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-