రోజుకు 5సార్లు హనుమాన్ చాలీసా పఠిస్తే కరోనా ఖతమట?

0

ప్రపంచాన్ని కమ్మేసిన కరోనాకు మందు రాక.. కనిపెట్టలేక ఆపసోపాలు పడుతున్నారు శాస్త్రవేత్తలు.మరోవైపు ఈ రోగం బారినపడి రోగనిరోధక శక్తిని పెంచుకొని బయటపడుతున్నారు జనాలు. అల్లకల్లోలంగా మారిన ఈ వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ప్రస్తుతానికి భౌతికదూరం.. ఫేస్ మాస్క్ ధరించడం.. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవడమే మార్గం.

కానీ తాజాగా బీజేపీ వివాదాస్పద ఎంపీ ప్రగ్యా ఠాకూర్ సంచలన ప్రకటన చేశారు. హనుమాన్ చాలీసా పఠిస్తే కరోనా రాదని ఆమె సెలవిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

కరోనాతో పోరాడేందుకు అందరూ జూలై 25 నుంచి ఆగస్టు 5 వరకు తప్పనిసరిగా రోజుకు 5సార్లు హనుమాన్ చాలీసా పఠించండని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ తెలిపారు.. ఆఖరి రోజు ఇంట్లో దీపాలను వెలిగించి రాముడికి హారతి పట్టాలని సూచించారు. హిందువులంతా హనుమాన్ చాలీసాను పఠిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని.. కరోనా నుంచి విముక్తి పొందుతామని సూచించారు.

వచ్చేనెల 4వ తేది వరకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న భోపాల్ లో లాక్ డౌన్ ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే 5వ ఈ తంతు ముగించాలని.. అదేరోజున అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరుగనుందని ఆమె తెలిపారు.