కరోనా కలకలం..పారిపోవడానికి యత్నించిన పేషేంట్!

0

తాజాగా ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఒక యువకుడు లండన్ నుంచి ఒంగోలుకి రాగా – ఆ యువకుడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో అతడికి వైద్యపరీక్షలు నిర్వహించి పుణెకు శాంపిల్స్ పంపారు.. రిపోర్ట్స్లో పాజిటివ్ గా తేలింది. కరోనా పాజిటివ్ అని తెలియడంతో వెంటనే అతన్ని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే తనకి కరోనా వైరస్ సోకిందనే మానసిక బాధతో ఆ యువకుడు ఒంగోలు రిమ్స్ ఐసోలేషన్ వార్డు నుండి పారిపోయే ప్రయత్నం చేసాడు.

ఈ ఊహించని ఘటనతో వెంటనే అలర్ట్ అయిన ఆస్పత్రి సిబ్బంది .. నాలుగో ప్లోర్ లో అతడ్ని పట్టుకున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఇక కరోనా సోకిన వ్యక్తి ఇంటికి చుట్టూ 3 కి.మీ పరిధిమేర ప్రత్యేక జోన్ గా ప్రకటించి..ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వెల్లడించారు. అలాగే ఒంగోలులోని మాల్స్ – థియేటర్లు మూసివేయించినట్లు తెలిపారు. కరోనా బాధితుడి ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా రిమ్స్ ఐసోలేషన్ వార్డులో ఉంచామని తెలిపారు.

కాగా ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒంగోలు లో మరో యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 109 మంది శాంపిల్స్ సేకరించగా.. వారిలో 94 మందికి నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. మరో 13 మంది రిపోర్టులు రావాల్సి ఉందని ఒక బులిటెన్ ద్వారా తెలియజేశారు.మరోవైపు కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు – కాలేజీలు – యూనివర్సిటీ లు – కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-