ఖమ్మంలో మెడిసిన్ విద్యార్థికి కరోనా

0

కరోనా వైరస్.. కరోనా వైరస్ ..కరోనా వైరస్ ..ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే పేరు. అసలు ఈ పేరు వింటేనే చాలా మందికి ఇప్పుడు జ్వరం వచ్చేస్తుంది. చైనా లో పుట్టిన ఈ కరోనా వైరస్ అక్కడ తగ్గుముఖం పట్టినప్పటికీ … ఇతర దేశాల లో తన పంజా విసురుతోంది. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ ఈ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. అలాగే భారత్ లో కూడా కరోనా అనుమానిత కేసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పెరిగిపోతున్నాయి. ఇక భారత్ లో ఎప్పటివరకులు 62 మందికి కరోనా సోకినట్టు తెలుస్తుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా కారణంగా ఇప్పటికే సుమారుగా 4300 మంది చనిపోయారు.

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ఈ కరోనా వల్ల తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కరోనా కలకలం రేగుతోంది. తాజాగా ఖమ్మంలో కరోనా అందరిని ఆందోళనకి గురిచేస్తుంది. ఓ మెడిసిన్ విద్యార్థిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి ఐసోలేటెడ్ వార్డులో పెట్టి చికిత్స అందిస్తున్నారు. అమెరికా లో చదువుతున్న ఈ విద్యార్థి ఈ నెల 7న తిరిగి వచ్చాడు. అమెరికా నుండి వచ్చినప్పటినుండి దగ్గు జ్వరం తో బాధపడుతున్నాడు. దీనితో కరోనా ఏమైనా సోకిందేమో అన్న అనుమానం తో వెంటనే ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి శాంపిల్స్ను సేకరించి పరీక్షల కోసం పంపిస్తున్నారు.

అలాగే మరోవైపు హైదరాబాద్ ను కూడా కరోనా వెంటాడుతోంది. నిన్న శంషాబాద్ విమానాశ్రయం లో కరోనా కలకలం రేపింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించాయి. అధికారులు అప్రమత్తం అయ్యారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహించనున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని థర్మల్ స్క్రీనింగ్ లో పరీక్షలు చేసిన తర్వాత ఎయిర్ పోర్ట్ నుండి బయటకి పంపిస్తున్నారు. అయితే ఆ ప్రయాణికులు మాత్రం దుబాయ్ వరకు తమకు ఎలాంటి స్క్రీనింగ్ జరుగలేదని బ్రిటీష్ ఎయిర్ వేస్ లో వచ్చామని వర్బల్ క్వెశ్చన్స్ అడిగారని తెలిపారు. దుబాయ్ లో తమకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారని తెలిపారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-