కరోనా మరణాలు .. చైనాని దాటేసిన రెండు దేశాలు !

0

కరోనా వైరస్ …ఈ మహమ్మారి చైనా లోని వుహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఒక్కో దేశం వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాలకి పాకింది. అయితే కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం లేదు. దీనితో కరోనా పై మేము విజయం సాధించాం అంటూ చైనా ప్రకటించుకుంది. ఇప్పటివరకు చైనాలో 3281 మంది మరణించారు. అయితే కరోనా మరణాల సంఖ్య లో చైనాని ఇటలీ దాటేసింది. తాజాగా మరణాల సంఖ్యలో చైనాను మరో దేశం కూడా దాటి వేయడంతో ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతుంది.

ఇకపోతే తాజాగా స్పెయిన్ లో కరోనా మరణాల సంఖ్య 3 647 కి చేరింది. ఇది చైనా కంటే 300 ఎక్కువ. కొత్త కరోనా కేసులు కూడా భారీగానే పెరిగాయి. స్పెయిన్ లో ప్రస్తుతం 49515 మంది కరోనా భాదితులు ఉన్నారు. ఇక ఇటలీ లో కరోనా మరణ మృదంగం మోగిస్తుంది. కరోనా బయట పడిన చైనా కంటే ఇటలీ లో మరణాల రేటు రెండు రేట్లు ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు ..ఇటలీ లో 7503 మరణించగా 9362 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం అక్కడ 74386 మంది భాదితులు ఉన్నారు. దీనితో కరోనా మరణాల సంఖ్యలో కానీ చైనా మూడో స్థానంలోకి వెళ్లింది. ఇక మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ..కరోనా కారణంగా 21297 మంది మృత్యువాత పడ్డారు. అలాగే 471794 మంది కరోనా వ్యాధితో భాదపడుతున్నారు. 114703 మంది కరోనా నుండి కోలుకున్నారు. ముఖ్యంగా అమెరికా ఇటలీ స్పెయిన్ లో కరోనా మరణాలు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

వైరస్ సోకిన వారి విషయానికి వస్తే చైనాలో81 ఇటలీలో 74 వేలు అమెరికాలో 68వేలు స్పెయిన్లో 49వేలు జర్మనీలో 37 వేలు ఇరాన్లో 27వేలు ఫ్రాన్స్లో 22వేలకు పైగా ఉన్నారు. చైనా (3287) ఇటలీ (7503) స్పెయిన్ ( 3647 ) ఇరాన్ (2077) ఫ్రాన్స్ (1331) దేశాల్లో మృతుల సంఖ్య వేలల్లో ఉంది. అమెరికా లో 1032 మంది చనిపోయారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-