తమిళనాడును వణికిస్తున్న కోయంబేడు.. ఏమైందంటే ?

0

తమిళనాడులో కరోనా వైరస్ రోజురోజుకి చాపకిందనీరులా విస్తరిస్తుంది. తమిళనాడు లో ఇప్పటివరకు 3550 పాజిటివ్ కేసులు నమోదు కాగా ..అందులో 31 మంది మరణించారు. ఇకపోతే ప్రస్తుతం 2110 మంది కరోనా కి చికిత్స తీసుకుంటున్నారు. 1409 మంది కరోనా కి చికిత్స తీసుకోని డీఛార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో కరోనా కేసులు పెరగడానికి కారణం ఏంటి అని అధికారులు అరా తీయగా అసలు కారణం బయటపడింది. తమిళనాడు లో వేగంగా కరోనా కేసులు పెరుగుతుండటానికి కారణం ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ గా పేరు పొందిన కోయంబేడు మార్కెట్.

ఢిల్లీ మర్కజ్ ద్వారా వచ్చిన కరోనా వ్యాప్తిని తమిళనాడు ప్రభుత్వం అడ్డుకోగలిగినా.. కొత్తగా కోయంబేడు ఉపద్రవాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. చెన్నైలో ఉన్న కోయంబేడు మార్కెట్ వల్ల ఒక్క చెన్నై మాత్రమే కాకుండా.. చుట్టుపక్కల ఉన్న పలు జిల్లాలు కరోనా బారిన పడ్డాయి. ఫలితంగా సోమవారం ఒక్కరోజే అత్యధిక స్థాయిలో 527 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అధికంగా చెన్నైలో 266 కడలూరులో 122 విల్లుపురంలో 49 పెరంబలూరులో 25 కొత్త కేసులు ఉన్నాయి. కొత్త కేసుల్లో చాలా వరకు కోయంబేడు ద్వారా వచ్చినవేనని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ గుర్తించింది. సోమవారం వచ్చిన 527 కొత్త కేసులలో 400 లకు పైగా కేసులు కోయంబేడులో పనిచేసిన కార్మికులు వారిని కలిసిన వారివే కావడం గమనార్హం.

తమిళనాట కరోనా వ్యాప్తి దాదాపుగా అదుపులోనే వుందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కోయంబేడు ఉదంతంతో ఒక్కసారిగా సమీకరణలు మారిపోయాయి. ఊహించని స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. కోయంబేడు మార్కెట్ లో కరోనా కేసులు వెలుగుచూసిన తరువాత పువ్వులు పండ్ల మార్కెట్ ను శివారు ప్రాంతం మాధవరానికి మార్చారు. తాజాగా వందల సంఖ్యలో కేసులు బయట పడడంతో మార్కెట్ ను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు.Please Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home