ప్రేమికుల రోజుకు విలన్ గా మారిన కరోనా వైరస్!

0

ప్రేమకు ఎన్నో అడ్డంకులు. ఎన్నో అడ్డుగోడలు. అవన్నీ సినిమాల్లో భూతద్దంలో పెట్టి మరీ చూపించి సాధారణ ప్రజలు చైతన్యవంతులను చేసింది సినీ సమాజం. అయితే కొత్తగా వచ్చిన వైరస్ కూడా ప్రేమికులకు ఒక విలన్ గా మారుతుందని.. లవర్స్ హాయిగా వాలెంటైన్స్ డే జరుపుకోనివ్వకుండా సతాయిస్తుందని మాత్రం ఎవరికీ తెలియదు. ఈ చైనా వాళ్లున్నారే వారే ఈ వాలెంటైన్స్ డే కి విలన్ గా మారిన కరోనా వైరస్ ను ప్రపంచానికి అందించిన మహానుభావులు.. వుహానుభావులు.

వాలెంటైన్స్ డే రోజు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అంతా ఓపెన్ సీక్రెట్. అందుకే కాసేపు సంప్రదాయవాదులు కళ్ళు మూసుకోండి.. సరదావాదులు సంతోషంగా సోది వినండి. ఒక రోజా పువ్విచ్చి లేదా ఖరీదైన బొకే ఇచ్చి ఐ లవ్ యు అంటారు. ఒకవేళ అవతలి పార్టీ కి కూడా ఈ ప్రతిపాదన నచ్చితే లవ్ యూ టూ అంటారు. లేకపోతే లైట్ తీసుకుంటారు. అయితే లవ్ యూ.. లవ్ యూ టూలు అనుకున్న తర్వాత ఈసారికి ఏమీ చెయ్యకుండా ఊరుకోవాల్సిందే. కారణం ఏంటంటే కరోనా వైరస్.

ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించే పెద్దన్నయ్య అమెరికా ను నిజానికి గడగడలాడించే అసలు అన్నయ్య చైనా. అలాంటి చైనానే ప్రస్తుతం కరోనా దెబ్బకు బెంబేలెత్తి పోతోంది. ఇక సాధారణ ప్రేమికుల సంగతి ఎంత? ప్రేమికులు కనీసం లిప్పు లిప్పు కలిపి అర్జున్ రెడ్డికి అసలు సిసలైన అనుచరుడిగా అధరామృతం గ్రోలుదామంటే అలా అమృతంలో ఓ మూల నక్కిన కరోనా వైరస్ కసక్కున మనల్ని పట్టుకుని ఫసాక్ చేస్తుంది తెగ భయపడి ఛస్తున్నారు!

దీనిపై ఇప్పటికే ఎన్నో సోషల్ మీడియాలో ఎన్నో సెటైర్లు.. జోకులు ప్రచారం లో ఉన్నాయి. పైన ఫోటో లో ఉన్నది అలాంటిదే. గాఢమైన ప్రేమికుల మూతుల మధ్య ఈ అడ్డుగోడల లాంటి మాస్కులు. దీంతో అమృతాన్ని గ్రోలడం అసాధ్యం.. ఫ్రెంచ్ కిస్సు అనేది ఇక శాశ్వతం గా మర్చి పోవాల్సిందే. మొత్తానికి కరోనా వైరస్ ఈసారి ప్రేమికుల కొంప ముంచింది!
Please Read Disclaimer