కరోనా వైరస్.. ఈ వస్తువులపై 9 రోజులు తిష్ట, ‘ఆల్కహాల్’తో 30 సెకన్లలో అంతం.. పరిశోధనల్లో వెల్లడి

0

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్‌పై పరిశోధనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఈ వైరస్‌ను చంపేందుకు సరైన ఔషదాన్ని ఇప్పటివరకు కనుగోలేదు. నివారణ కంటే ముందు.. ఆ వ్యాధి మరింత మందికి సోకకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం అని పరిశోధకులు తెలుపుతున్నారు. ఎందుకంటే.. ఇది సాధారణ వైరస్ కాదని, మహా మొండి వైరస్ అని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అవేంటో చూడండి.

వీటిని ముట్టుకున్నా ప్రమాదమే

కరోనా వైరస్ డోర్ హ్యాండిళ్లు, తలుపులు ఇతరాత్ర వస్తువులపై కూడా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా ప్లాస్టిక్, చెక్క, నేలపై సుమారు 9 రోజులు బతికేస్తాయన్నారు. అయితే, ఈ వైరస్ ఎంత కాలం జీవిస్తుందనేది వాతావరణంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

చలి పెరిగితే.. ముప్పు పెరిగినట్లే..

చలి తీవ్రత పెరిగే వైరస్ మురింత విస్తరించే అవకాశం ఉంటుందని పరిశోధకులు తెలిపారు. సాధారణ వాతావరణంలో వైరస్ 9 రోజులు జీవిస్తుందన్నారు. చలి తీవ్రత 4 డిగ్రీలు వరకు నమోదైతే వైరస్ సుమారు 28 రోజులు జీవించగలదని, -4 డిగ్రీల్లో ఈ వైరస్ సుమారు నెల రోజులు కంటే ఎక్కువ జీవించగలదన్నారు. ఇవి సాధారణ వైరస్‌కు 4 రెట్లు ప్రమాదకరమని తెలిపారు. ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైతే అవి జీవించలేవని పేర్కొన్నారు.

ఆల్కహాల్ నివారిస్తుందా?

‘ఆల్కహాల్’ తాగితే వైరస్ తగ్గుతుందని భావిస్తే పప్పులో కాలేసినట్లే. పరిశోదనల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. కరోనా వైరస్ ప్రబలిన తర్వాత ఎన్ని మందులు వేసుకున్నా ఫలితం ఉండదు. కేవలం ముందు జాగ్రత్తతోనే సాధ్యమవుతుంది. కరోనా వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సంచరించేప్పుడు ఫేస్‌మాస్క్‌తోపాటు చేతికి గ్లౌస్ కూడా ధరించాలి. వాటిని తీసేసిన తర్వాత ఆల్కహాల్ కలిసిన క్లీనింగ్ లిక్విడ్‌లతో చేతులను, శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. బ్లీచింగ్, ఆల్కహాల్ తగలగానే వైరస్ 30 సెకన్ల వ్యవధిలో చనిపోతాయి.

తాకితే వైరస్ సోకుతుందా?

జర్మనీకి చెందిన రుహ్ర్ యూనివర్శిటీ బోచుం, యూనివర్శిటీ ఆఫ్ గ్రెయిఫ్స్వాల్డ్ నిపుణులు సంయుక్తంగా ఈ పరిశోధనలు నిర్వహించారు. అయితే, తాకడం వల్ల ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా అనే విషయంపై కూడా స్పష్టత ఇవ్వలేకపోయారు. ఈ వైరస్ రోగి ఉమ్మిలోనే ఎక్కువ శాతం ఉంటుందని, తుమ్ము, దగ్గుల ద్వారా అది ఇతరులకు సోకుతుందన్నారు. అలాగే, వారి ఉమ్మి నేలపై పడినట్లయితే సాధారణ ఉష్ణోగ్రతల్లో 9 రోజులు జీవిస్తుందని, అది 4 రెట్లు ప్రమాదకరంగా ఉంటుందని తెలిపారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-