ఆసుపత్రుల్లో ఉన్నోళ్లు టార్చర్ పెడుతున్నారా?

0

ఉన్నది ఉన్నట్లుగా.. నిష్ఠూరమైనా నిజాన్ని చెప్పాలన్నప్పుడు అదెంత దారుణంగా ఉంటుందన్న విషయం తాజాగా మంత్రి ఈటెల రాజేందర్ మాటల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. కరోనా బాధితులకు పైసా ఖర్చు లేకుండా.. చాలా కేర్ పుల్ గా ట్రీట్ మెంట్ ఇస్తున్న వైనం తెలిసిందే. ఆసుపత్రుల్లో రాజభోగాలంటే కరోనా బాధితులదే చెప్పాలి. నిజమే.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ.. వాటిని మందులతో అధిగమించేందుకు వైద్యులు కిందామీదా పడుతుంటే.. బాధితుల తీరు మాత్రం వేరేలా ఉందని చెప్పాలి.

కరోనా బాధితులుగా ఇప్పటివరకూ గుర్తించిన వారిలో మధ్య వయస్కులే అధికం. అలాంటి వారిలో వైరస్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ.. ఆరోగ్య సమస్యలు (గొంతు నొప్పి.. ఊపిరి తీసుకోవటంలో సమస్యలు.. దగ్గు.. జలుబు ) కాస్త తగ్గుముఖం పట్టినోళ్లు వైద్యులకు.. వైద్య సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నారట. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 33 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అలాంటి వారిలో ఎక్కువమంది విపరీతమైన కోరికల్ని కోరుతున్న వైనంపై వైద్యులు విస్తుపోతున్నారు. ప్రాణాంతక వైరస్ తో తాము పోరాటం చేస్తున్నామన్న విషయాన్ని వదిలేసి.. ఊహించని కోరికల్ని కోరుతూ ఒళ్లు మండేలా చేస్తున్నారట. ఆసుపత్రుల్లో ఉన్నామన్న సోయి లేకుండా.. చికెన్.. మటన్ కావాలంటూ అడుగుతున్న తీరు చూస్తే.. వాళ్ల చేష్టలు వైద్యులకే కాదు.. ప్రభుత్వానికి సైతం షాకింగ్ గా మారిందంటున్నారు. వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వారిని అనునయించటానికి పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావంటున్నారు. అలా అని ఇలాంటి తీరు అందరిలో లేకున్నా.. కొందరి తీరు మాత్రం అస్సలుబాగోలేదంటున్నారు.

కరోనా వైరస్ కారణంగా తాము ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నామే కానీ.. తామేమీ లగ్జరీ ట్రిఫ్ లో భాగంగా ఫైవ్ స్టార్ హోటల్లో లేమన్న విషయాన్ని గుర్తించాలన్న మాట వినిపిస్తోంది. అవసరమైన వసతులు మాత్రమే ప్రభుత్వం కల్పిస్తుందే తప్పించి.. అడ్డమైన కోరికలు కోరకూడదన్న విషయాన్ని మర్చిపోతున్నారంటున్నారు. ఇప్పుడు నడుస్తున్న పది రోజులు చాలా క్లిష్టమైనవని.. ప్రపంచ యుద్ధం కంటే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని వదిలేసి.. తమకు కల్పించాల్సిన సౌకర్యాలపై బాధితులు వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం బాగుండటం లేదన్న మాట వినిపిస్తోంది. అడ్డమైన వైరస్ తీసుకురావటమే కాదు.. ఆసుపత్రుల్లో మందులు వేసుకొని రెస్టు తీసుకోవాల్సింది పోయి.. చికెన్.. మటన్ కావాలని కోరుడేంది?
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-