కరోనా సూచన..ఇంట్లోనే శానిటైజర్‌ చేసుకోండి!

0

కొవిడ్‌-19(కరోనా) వైరస్‌ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఆర్థిక వ్యవస్థల్ని సైతం కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ దరిచేరదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సహా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముక్కుకు మాస్కులు ధరించడం, చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం వంటి సూచనల్ని తప్పకుండా పాటిస్తే వైరస్‌ సోకే ప్రమాదాన్ని భారీగా తగ్గించొచ్చని చెబుతున్నారు. అయితే సబ్బుతో చేతులు కడుక్కోవడం అన్ని సందర్భాల్లో  అంత సులభం కాదు. దానికి కోసం ప్రత్యేకంగా సమయం కూడా కేటాయించాల్సి వస్తుంది. దీనికి చక్కటి పరిష్కారం హ్యాండ్‌ శానిటైజర్లు. వీటినైతే ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మనం ఉన్నచోటే చేతుల్ని శుభ్రం చేసుకోవచ్చు. అలా అని శానిటైజర్లు లేనప్పుడు సబ్బుతో చేతుల్ని కడుక్కోవడం మాత్రం మానెయ్యొద్దు. 

పెరుగుతున్న డిమాండ్‌..

వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో హ్యాండ్‌ శానిటైజర్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. అగ్రరాజ్యంలోనైతే గత వారం రోజుల్లో అమ్మకాలు 1400 శాతం పెరిగాయని అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు కొరియా, చైనాలోనైతే గంటల తరబడి క్యూలో నిలబడి మరీ కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదీ ఒక వినియోగదారుడికి ఒకటి మాత్రమే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే శానిటైజర్‌ తయారుచేసుకునే మార్గాన్ని సూచిస్తున్నారు నిపుణులు. దీనికి కావాల్సిన కొన్ని పదార్థాలు సమకూర్చుకోగలిగితే శానిటైజర్‌ కొరత నుంచి తప్పించుకోవచ్చు. ఎలా చేయాలో అమెరికాలోని ఓ ప్రముఖ వైద్యుడు ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రికకు వివరించారు. అదెలాగో చూద్దాం..

ఎలా చేసుకోవాలి…

దీనికి కలబంద, రబ్బింగ్‌ ఆల్కహాల్‌గా పిలిచే ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ లేదా ఇథనాల్‌ కావాల్సి ఉంటుంది. రబ్బింగ్‌ ఆల్కహాల్‌, కలబందను బాగా కలిసే వరకు మిశ్రమంగా కలుపుకోవాలి. ఆల్కహాల్‌ వాసన పోయేలా దీనికి ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ కలుపుకోవచ్చు. దీన్ని ఓ బాటిల్‌లో స్టోర్‌ చేసుకొని శానిటైజర్‌గా వాడుకోవచ్చు. అయితే ఈ మిశ్రమంలో 60శాతం ఆల్కహాల్‌ ఉంటేనే ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొన్నారు.

ఎలా పనిచేస్తుందంటే..

శానిటైజర్లు అన్నిరకాల వైరస్‌లను చంపవని వైద్యులు చెబుతున్నారు. అయితే తాజా కరోనా వైరస్‌పై మాత్రం మంచి ప్రభావం చూపుతుందని నిపుణులు తెలిపారు. సాధారణంగా వైరస్‌ వెలుపల ఉండే ‘ఎన్వెలప్‌ గ్లైకోప్రోటీన్‌’ అనే నిర్మాణం దానికి రక్షణ కవచంలా పనిచేస్తోంది. శానిటైజర్‌లో ఉండే ఆల్కహాల్‌ దీన్ని బలహీనపరుస్తుంది. దీంతో వైరస్‌ చనిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సబ్బు కూడా ఇదే తరహాలో పనిచేస్తుంది. కానీ, శానిటైజర్‌ వాడడం కాస్త సౌకర్యంగా ఉంటుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-