21 రోజుల సవాల్..లాక్ డౌన్ లో కుటుంబంతో ఎలా మెలగాలి?

0

ప్రపంచం కొత్త పరిస్థితులను చూస్తోంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లోని 43 ఏళ్ల లోపు వారిలో చాలామంది ఇలాంటి పరిస్థితులు మునుపెన్నడూ చూసి ఉండరు. దేశ విభజన సమయంలో దిల్లీ నుంచి ఎగువ ప్రాంతంలో పెద్ద ఎత్తున అల్లర్లు.. అణచివేతలు తెలిసిందే. ఆ తరువాత ఇందిరాగాంధీ 1975-77 మధ్య ఎమర్జెన్సీ విధించినప్పుడు దేశమంతా అల్లకల్లోలమైంది. కర్ఫ్యూలు.. లాఠీచార్జిలు.. బలవంతపు కుటుంబ నియత్రణలు.. ఒకటేమిటి సకల అరాచకాలూ చోటుచేసుకున్నాయి. అప్పటికి ఊహ తెలిసినవారికి మాత్రమే దేశంలో క్లిష్టపరిస్థితులు ఎంతోకొంత తెలుసు.. ఆ తరువాత దేశవ్యాప్తంగా ప్రభావం చూపిన ఇలాంటి పరిస్థితులు ఎన్నడూలేవు.. మత కల్లోలాలు వంటివి జరిగినా కొన్ని ప్రాంతాలకే అవి పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు కరోనా వైరస్ నియంత్రణకు దేశమంతా 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో జనమంతా ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కర్ఫ్యూ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి వేళ.. పనులు లేకపోవడం.. ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలే కాదు కుటుంబాల్లో మనుషుల మధ్య సంబంధాలు కూడా దెబ్బతినే ప్రమాదముంటుందని.. వీటన్నిటినీ అధిగమించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని సైకాలజిస్టులు చెబుతున్నారు.

కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఇప్పుడు ఇళ్లలోనే ఉండిపోవాల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ”రాజీ” చేసుకోవాలని అందరితో ప్రేమగా మెలగాలని కుటుంబ బంధాలను డీల్ చేసే స్వచ్ఛంద సంస్థ ఒకటి సూచిస్తోంది. తాజా పరిస్థితుల వల్ల కుటుంబమంతా రోజంతా ఇంట్లోనే ఉండి పోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న కొన్ని వారాలు సామాజిక కుటుంబ సంబంధాలకు పరీక్షే.

తాజాగా వాట్సాప్లో వైరల్ అవుతున్న వీడియో ఒకటి దీనికి ఉదాహరణగా చెప్పాలి. లాక్ డౌన్ పేరుతో రోజంతా ఇంట్లో ఉండమంటే ఎలా.. పెళ్లాలతో ఎలా వేగాలి అంటూ ఓ నడివయస్కుడు ఏడుస్తూ తన గోడు చెప్పుకోవడం అందులో ఉంటుంది. ఇది సోషల్ మీడియాలో ఫన్ క్రియేట్ చేయడానికి చేసిన వీడియో అయినప్పటికీ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే పరిస్థితులు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

* ఇలాంటి ఉదాహరణలు ఎన్నో..
కార్డిఫ్లోని నోరిస్ కుటుంబంలో ఒకే ఇంట్లో మూడు తరాలు ఉన్నాయి. ఫ్రెడ్ (58) సుజెట్ (56)లు తమ ఇద్దరు పిల్లల్లో ఒకరైన ఫియాన్ (22) ఆమె 19 నెలల కొడుకు థియోతో కలిసి నివసిస్తున్నారు. ఇది చాలా కష్టమైన సమయం.. అందరం ఇంట్లోనే ఉంటే ఏకాంత సమయమే ఉండదు అన్నారు సుజెట్. ”నాకు పిచ్చెక్కుతోంది. నా ఆయువును కరోనావైరస్ కన్నా సుజెట్ ఎక్కువగా సవాల్ చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. వారం తిరిగేసరికి సుజెట్ నన్ను చంపేస్తుంది” అంటాడు ఫ్రెడ్. ఇది సరదాగా అన్నదే అయినా సాధారణంగా కంటే ఎక్కువ సమయం కుటుంబంలోని వారంతా కలిసి ఉంటే పొరపొచ్చాలు వచ్చే ప్రమాదం ఉందంటారు సైకాలజిస్టులు.

ఇక తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఫియాన్ కు తన 19 నెలల కొడుకును డీల్ చేయడం మరింత కస్టమవుతోంది. మామూలుగా అయితే ఈతకు ఆటకు బయటకు తీసుకెళ్లొచ్చు. కానీ ఇప్పుడదేమీ వీలుపడడం లేదు. దీంతో పిల్లాడిని రోజంతా డీల్ చేయడం పెద్ద ప్రయాసగా మారిందని ఫియాన్ గగ్గోలు పెడుతున్నారు. అయితే.. బయట పరిస్థితులతో మనం పోరాడాల్సి వస్తున్నప్పుడు ఇంట్లో ఒకరికి ఒకరు సహకరించుకుంటూ రాజీపడాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.

డాక్టర్ బ్రెసాలియర్.. 1918లో ప్రపంచ వ్యాప్తంగా ఐదు కోట్ల మందికి పైగా ప్రజలను బలితీసుకున్న స్పానిష్ ఫ్లూ మహమ్మారి మీద నిపుణుడు. ”నాడు జనం యుద్ధ పరిస్థితులకు.. వివిధ రకాల ఆంక్షలకు లోటుపాట్లకు అలవాటుపడి ఉన్నారు. అయితే.. వారిలో సామాజిక ప్రయోజనం అనే భావన బలంగా ఉంది. దేశ ప్రయోజనాల కోసం ఏదో ఒకటి చేసేవారు” అని ఆయన తెలిపారు. ”అదే తరహాలో ఇప్పుడు.. సామాజికంగా ఏకాంతవాసానికి కదలికల మీద ఆంక్షల విషయంలో మనం ఎప్పటికన్నా మెరుగైన పరిస్థితుల్లో ఉన్నాం. మనకు సోషల్ మీడియా ఉంది. చాలా మందికి నెట్ఫ్లిక్స్ వంటి అనేక ఆన్లైన్ వనరులు అందుబాటులో ఉన్నాయి” అని విశ్లేషించారు. 1918లో స్కూళ్లు సినిమాలు మూసివేయటం కొన్ని ప్రదేశాలకు వెళ్లటానికి పరిమితమైన అనుమతులే ఉన్నప్పటికీ.. ఇప్పుడు కరోనావైరస్ కారణంగా విధిస్తున్న ఆంక్షల వంటివి మునుపెన్నడూ లేవని డాక్టర్ బ్రెసాలియర్ చెప్పారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-