3 లక్షలు తీసుకుంది.. వైసీపీ మహిళా ఎమ్మెల్యేపై లంచం ఆరోపణలు..!

0

వైసీపీ మహిళా నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై అవినీతి ఆరోపణలు భయటకొచ్చాయి. ఫిరంగిపురం మండలం బేతపూడి సొసైటీ అధ్యక్షుడు జాకీర్ ఎమ్మెల్యే శ్రీదేవి బండారాన్ని బట్టబయలు చేశారు. సిమెంట్ రోడ్డు బిల్లుల విషయంలో ఎమ్మెల్యే శ్రీదేవి 3 లక్షలు లంచం తీసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తన సొసైటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. అయితే ఈ విషయాన్ని త్వరలోనే సీఎం జగన్ దృష్టికి తీసుకెళతానని అన్నారు.

అయితే ఈ మేరకు మీడియాతో మాట్లాడిన జాకీర్ శ్రీదేవిపై మరికొన్ని ఆరోపణలు కూడా చేశాడు. తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవి చెప్పిన వారికే పనులు జరుగుతున్నాయని, పార్టీ కోసం పని చేసిన వారిని అసలు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2017-18 సంవత్సరంలో టీడీపీ నాయకులు 11 లక్షల బిల్లులు పెట్టారని వాటిని మంజూరు చేయొద్దని కోరినా కానీ ఎమ్మెల్యే శ్రీదేవి 3 లక్షలు లంచం తీసుకుని ఆ బిల్లులు మంజూరు చేశరని అన్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-