ఎక్కడా చోటులేనట్లు.. ఒకే రోజు, రెండుసార్లు రైల్వే స్టేషన్‌లో సెక్స్!

0

రైలు లేటైందో.. కోరికలు ఆపుకోలేకపోయారో తెలియదు గానీ, ఓ జంట రైల్వే స్టేషన్‌లోనే బరితెగించారు. ప్రయాణికులు చూస్తుండగానే రైల్వే ప్లాట్‌ఫాం మీద సెక్స్‌లో పాల్గొన్నారు. ఒకసారి ఏదో పొరపాటు చేశారని అనుకొనేలోపే.. మరోసారి అదే పని చేసి ప్రయాణికులకు షాకిచ్చారు. దీంతో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రయాణికులతో నిత్యం బిజీగా ఉండే న్యూయార్క్ రైల్వే స్టేషన్‌లో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఉదయం 9.30 గంటలకు బోవ్లింగ్ గ్రీన్ స్టేషన్ సబ్ వేలోకి ప్రవేశించిన ప్రయాణికులకు ఓ జంట ఊహించని షాకిచ్చారు. అయితే, ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ వారిని పట్టించుకోకుండా రైలెక్కి వెళ్లిపోయారు. అయితే, సాయంత్రం 6.40 గంటలకు మళ్లీ ఆ జంట అదే పనికి పాల్పడింది. రైల్లో వెళ్తున్న ప్రయాణికులు ఈ ఘటనను వీడియో తీశారు.

ప్రయాణికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ కెమేరాల్లో ఆ జంటను గుర్తించేందుకు ప్రయత్నించారు. చివరికి పురుషుడి ఫొటో మాత్రమే దొరికింది. ఈ ఘటన న్యూయార్క్ పత్రికల్లో ప్రధానంగా ప్రచురితమైంది. దీంతో అది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది. వారికి అంత కక్కుర్తి ఎందుకు? ఇంటికి వెళ్లో.. రూమ్ తీసుకొనే చేసుకోవచ్చుగా? ఇలా పబ్లిక్‌లో సిగ్గులేకుండా ఏం పని అది అని నెటిజనులు తిట్టిపోస్తున్నారు. బహుసా.. న్యూయార్క్ ప్రజలకు నగరంలో చోటే దొరకడం లేదేమో.. అందుకే ఈ రైల్వే స్టేషన్‌లో ఇలాంటి పనులు చేస్తున్నారని మరికొందరు చమత్కరిస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం ఈ జంటను వెతికే పనిలో ఉన్నారు.
Please Read Disclaimer