షాకింగ్.. మెట్రో రైలులో సెక్స్, పోర్న్ వెబ్‌సైట్లలో ప్రత్యక్షమైన వీడియో!

0

‘ప్రేమ’లో మునిగితే ప్రపంచాన్ని మరిచిపోవచ్చు. కానీ, కామంలో మునిగితే.. పరిసరాలను కూడా మరిచిపోయి బరితెగిస్తారని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఇటీవల హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో ప్రేమ జంటలు లిఫ్ట్‌లో ముద్దులు పెట్టుకుని వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. ఆ వీడియో వివిధ యూట్యూబ్ చానళ్లు, పోర్న్ వెబ్‌సైట్లకు చేరడంతో పెద్ద రాద్దాంతమే జరిగింది.

తాజాగా ఢిల్లీ మెట్రో రైలులో ఓ యువ జంట చేసిన ఘన కార్యం కూడా పోర్న్ వెబ్‌సైట్లలో చక్కర్లు కొడుతోంది. జులై 18న రికార్డైన ఈ వీడియోలో ఓ యువ జంట న్యూఢిల్లీ నుంచి ఐజీఐ విమానాశ్రయంలోని టెర్మినల్ 3కు ప్రయాణించే ‘ఎక్స్‌ప్రెస్ మెట్రో’ ఎక్కారు. ఈ రైలుకు తక్కువ స్టాపులు ఉండటం, ఆ బోగీలో ప్రయాణికులు కూడా లేకపోవడంతో దుస్తులు విప్పేసి మరీ రతి క్రీడలో మునిగితేలారు.

మెట్రో రైలు సీసీటీవీ ఆపరేటింగ్ రూమ్‌లో ఉన్న కొందరు ఈ వీడియోను తమ మొబైళ్ల ద్వారా లైవ్‌లో రికార్డు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం 2.22 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. పది రోజుల వ్యవధిలోనే ఆ వీడియోలు చేతులు మారాయి. ఒకరి నుంచి ఒకరికి చేతులు మారుతూ చివరికి పోర్న్ వెబ్‌సైట్లలో ప్రత్యక్షమయ్యాయి. ఇప్పటివరకు సుమారు ఒక లక్ష మందికి పైగా చూసినట్లు అధికారులు చెబుతున్నారు.

బహిరంగ ప్రాంతంలో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఆ గుర్తుతెలియని జంటపై కేసులు నమోదు చేసినట్లు అజాద్‌పూర్ పోలీసులు తెలిపారు. మరోవైపు.. ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్(డీఎంఆర్సీ) ఆధీనంలో ఉండాల్సిన ఈ వీడియో బయటకు రావడం అంతర్గత విచారణ జరుగుతోంది.

ఢిల్లీ మెట్రోలో ఇలాంటి లైంగిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంఆర్సీ కార్పొరేట్ కమ్యునికేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంజూ దయాల్ హెచ్చరించారు. 2013లో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మెట్రో రైళ్లు, మెట్రో స్టేషన్లలో లైంగిక చర్యలు, సెక్స్ చేస్తున్న 200 పైగా వీడియోలు పోర్న్ వెబ్‌సైట్లలో ప్రత్యక్షమయ్యాయి. ‘మెట్రో పోర్న్’ పేరుతో ఆయా వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో మెట్రో నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు.
Please Read Disclaimer