ఓ మై గాడ్.. కస్టమర్లు చూస్తుండగానే స్టోరులో పోర్న్ వీడియో ప్రదర్శన!

0

 షాపింగ్ మాల్‌లో ఏర్పాటు చేసిన పెద్ద ఎల్ఈడీ టీవీ స్క్రీన్‌లో పోర్న్ వీడియోను ప్రదర్శించారు. ఈ ఘటనలో స్టోర్ సిబ్బంది ప్రమేయం ఏమీ లేదు. స్టోర్‌లోని కంప్యూటర్లను హ్యక్ చేసిన సైబర్ నేరగాళ్లు ఈ పనికి పాల్పడ్డారు. అయితే, వారు చేసిన పని వల్ల కస్టమర్లు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పిల్లలతో పాటు షాపింగ్‌కు వచ్చిన కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు.

న్యూజిలాండ్‌లో నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే ఆక్లాండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ షాపింగ్ మాల్‌లో బయట ఏర్పాటు చేసిన ఓ పెద్ద ప్రకటన స్క్రీన్ మీద అకస్మాత్తుగా పోర్న్ వీడియో ప్రత్యక్షమైంది. దీంతో కస్టమర్లు ముక్కున వేలు వేసుకున్నారు. ఇంకొందరు అక్కడే నిలుచుని ఆ వీడియో పూర్తయ్యే వరకు చూశారు. తల్లిదండ్రులు తమ పిల్లల కళ్లు మూసి అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు.

ఉదయం సుమారు 8 గంటల నుంచి ఈ వీడియో ప్లే అవుతున్నట్లు కస్టమర్లు తెలిపారు. 10 గంటలకు స్టోర్ తెరిచేందుకు వచ్చిన సిబ్బంది ఆ వీడియో చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే కంప్యూటర్లు నిలిపేశారు. అయితే, ఆ వీడియోలేవీ తమ ప్రకటనలో లేవని, హ్యాకర్లు తమ కంప్యూటర్లలోకి చొరబడి ప్రకటనలు తొలగించి, పోర్న్ వీడియోలను పెట్టడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

సుమారు 2 గంటల సేపు ఈ వీడియో టీవీలో ప్రసారమైంది. దీంతో కొందరు ఈ బాగోతాన్ని తీసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు. దీంతో ఆ స్టోర్ యాజమాన్యం కస్టమర్లకు క్షమాపణ చెప్పింది. ఇందులో తమ తప్పు ఏమీలేదని, సైబర్ అటాకర్లు తమ కంప్యూటర్లను హ్యాక్ చేసి ఆ వీడియోలు ప్రదర్శించారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తపడతామన్నారు.
Please Read Disclaimer