రాశి ఫలాలు 29 నవంబరు 2019

0

రాశి ఫలాలు 29 నవంబరు 2019

Daily Horoscope 29th November 2019

మేష రాశి

నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేయాలని పట్టుదల పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

వృషభ రాశి

దూరప్రాంతాల నుంచి వచ్చిన శుభవార్త ఆనందం కలిగిస్తుంది. ఆర్థికపరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

​మిథున రాశి

ఆదాయం కంటే ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సోదరులను కలుసుకుంటారు.

​కర్కాటక రాశి

ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.

​సింహ రాశి

నూతన కార్యక్రమాలు చేపట్టి జీవితభాగస్వామి సహాయసహకారాలతో దిగ్విజయంగా పూర్తిచేస్తారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

​కన్య రాశి

బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబసభ్యుల నుంచి ముఖ్యమైన పనులలో సాయం అందుకుంటారు.

​తుల రాశి

విందువినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఉద్యోగ, వివాహయత్నాలు ఫలిస్తాయి.

​వృశ్చిక రాశి

బంధువులతో ఏర్పడిన భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు.

ధనుస్సు రాశి

చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి.

​మకర రాశి

ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

​కుంభ రాశి

దీర్ఘకాలిక ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఋణాలు తీరి ఊరట చెందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

​మీన రాశి

ముఖ్యమైన వ్యవహారాలను సన్నిహితుల సాయంతో సకాలంలో పూర్తిచేస్తారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

నవంబరు 29 శుక్రవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 29 భృగువాసరే ఉదయం 6.16- సాయంత్రం 5.20

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంతరుతువు మార్గశిర మాసం-శుక్లపక్షం శూలం సాయంత్రం 5.13 వరకు తదుపరి గండం- తైతుల ఉదయం 6.55 వరకు తదుపరి గరజి సాయంత్రం 6.48 వరకు ఆ తదుపరి వణిజ తదియ సాయంత్రం 5.39 వరకు తదుపరి చవితి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
మూల ఉదయం 7.33 వరకు తదుపరి పూర్వాషాడ శేషం ఉదయం 7.33 లగాయతు తిరిగి 5.26 నుంచి 7.05 వరకు ఉదయం 8.33 నుంచి 9.18 వరకు తిరిగి మధ్యాహ్నం 12.15 నుంచి 1.02 వరకు ఉదయం 10.30 నుంచి 12.00 వరకు తెల్లవారి 5.02 నుంచి ఉదయం 9.30 నుంచి 10.00 తిరిగి సాయంత్రం 7.30 నుంచి 8.00Please Read Disclaimer