రాశి ఫలాలు 08 అక్టోబరు 2019

0

రాశి ఫలాలు 08 అక్టోబరు 2019

Daily Horoscope 8th October 2019

మేషం
పలు విధాలుగా ధనలాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

వృషభం

ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. జీవితభాగస్వామి నుంచి ధనలాభాలు పొందుతారు.

మిథునం
నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

కర్కాటకం

చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. సంఘంలో ఆదరణ పొందుతారు. దూరప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. వస్తులాభం ఉంది.

సింహ

జీవితభాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం. ధన, వస్తులాభాలు పొందుతారు. వాహనసౌఖ్యం పొందుతారు.

కన్య
బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యవహారాలు నిదానంగా, విజయవంతంగా పూర్తిచేస్తారు.

తుల
శ్రమకు తగిన ప్రతిఫలం దక్కదు. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

వృశ్చికం
నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాలు, వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

ధనుస్సు
కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. దూరప్రాంతాల నుంచి ఆస్తి గురించి కీలక సమాచారం అందుకుంటారు.

మకరం
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.

కుంభం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. స్వల్ప ధనలాభాలు.

మీనం
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు.

అక్టోబరు 8 మంగళవారం పంచాంగం.
తేదీ వారం సూర్యోదయం-సూర్యాాస్తమయం
అక్టోబరు 8 భౌమ్యవాసరే ఉదయం 5.54- సాయంత్రం 5.45

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం శరదృతువు ఆశ్వయుజమాసం-శుక్లపక్షం ధృతి తెల్లవారి 3.31 వరకు తదుపరి శూలం- గరజి సాయంత్రం 4.00 వరకు తదుపరి వణిజ తెల్లవారి 4.48 ఆ తదుపరి భద్ర/ విష్ఠి విజయదశమి మధ్యాహ్నం 2.50 వరకు తదుపరి ఏకాదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
శ్రవణం రాత్రి 8.12 వరకు తదుపరి ధనిష్ఠ రాత్రి 12.42 నుంచి 2.52 వరకు ఉదయం 8.21 నుంచి 9.09 వరకు తిరిగి రాత్రి 10.42 నుంచి 11.30 వరకు మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు ఉదయం 11.02 నుంచి 12.45 వరకు ఉదయం 7.00 నుంచి 7.30 తిరిగి సాయంత్రం 6.30 నుంచి 7.00Please Read Disclaimer