రాశి ఫలాలు 14 ఫిబ్రవరి 2019

0

రాశి ఫలాలు 14 ఫిబ్రవరి 2019

Daily Horoscope in Telugu 14th Feb 2019

మేషం

వ్యవహారాల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో విరోధాలు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. కొన్ని నిర్ణయాలలో పొరపాట్లు దొర్లుతాయి. కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. శారీరక రుగ్మతలు.. రియల్‌ ఎస్టేట్‌ల వారికి సమస్యలు వేధిస్తాయి. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు స్థాన మార్పు ఉండవచ్చు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలలో ఆటంకాలు. ఐటీ నిపుణులకు చిక్కులు. విద్యార్థులు కష్టానికి తగ్గ ఫలితం పొందలేరు. మహిళలకు కుటుంబంలో చికాకులు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి..

అదృష్ట రంగులు… కాఫీ, తెలుపు. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం
ఉత్సాహంగా పనులు చేపడతారు. నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆదాయం ఊహించిన పెరుగుతుంది. రియల్‌ఎస్టేట్‌ల వారికి ఒత్తిడులు. వ్యాపారాలలో ఆటంకాలు అధిగిమిస్తారు. ఉద్యోగులకు ఉత్సాహంగా గడుస్తుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు సన్మానాలు. ఐటీ నిపుణులకు నూతనోత్సాహం.. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో గౌరవం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు… పసుపు, గులాబీ. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం

కార్యక్రమాలలో అవరోధాలు. మానసిక అశాంతి. దూరప్రయాణాలు ఉండవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. శారీరక రుగ్మతలు.రియల్‌ఎస్టేట్‌ల వారి కృషి ఫలించదు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు శ్రమాధిక్యం. అధిక పనిభారం. పారిశ్రామికవర్గాలకు కొంత గందరగోళ పరిస్థితి. ఐటీ నిపుణులకు విదేశీ పర్యటనలు వాయిదా.. విద్యార్థులు అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు… పసుపు, బంగారు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం

పనులు సకాలంలో చక్కదిద్దుతారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. భూ, గృహయోగ సూచనలు. రియల్‌ ఎస్టేట్‌ల వారికి ప్రోత్సాహకరమైన రోజు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయ,పారిశ్రామికరంగాల వారికి ఊహించని అవకాశాలు. ఐటీ నిపుణులు  లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులు కొత్త కోర్సులు దక్కించుకుంటారు. మహిళలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు… ఎరుపు, గులాబీ. లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి.


సింహం

బంధువులతో సఖ్యత. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. శ్రమకు ఫలితం దక్కుతుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగవర్గాలకు పదోన్నతులు ఊరిస్తాయి. పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు. ఐటీ నిపుణులకు ఆహ్వానాలు. విద్యార్థులకు కృషి ఫలిస్తుంది. మహిళలకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. షేర్ల విక్రయాలు లాభిస్తాయి..

అదృష్ట రంగులు… కాఫీ, ఆకుపచ్చ. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య

పూర్వపు మిత్రుల కలయిక. శుభకార్యాలు, విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఊహలు నిజం చేసుకుంటారు. పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. గృహ, వాహనయోగాలు. రియల్‌ఎస్టేట్‌ల వారికి శ్రమకు ఫలితం దక్కుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవీ యోగం. ఐటీ నిపుణులు లక్ష్యాల వైపు సాగుతారు. విద్యార్థులకు పరిశోధనల్లో మంచి గుర్తింపు. మహిళలకు మానసిక ప్రశాంతత. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు… ఎరుపు, లేత పసుపు. గణపతిని పూజించండి.

తుల

ఇంటాబయటా ఒత్తిడులు. ఆదాయానికి మించి ఖర్చులు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. బంధువులతో వివాదాలు లకొంటాయి. రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడులు. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు చికాకులు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు దూరమవుతాయి. మహిళలకు మానసిక అశాంతి. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు… నీలం, నలుపు. లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం

కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యవహారాలలో విజయం. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆహ్వానాలు అందుతాయి, చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. రియల్‌ఎస్టేట్‌ల వారికి ఆటుపోట్లు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. ఐటీ నిపుణులకు అంచనాలు తప్పుతాయి. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. మహిళలకు ఆస్తిలాభం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు… ఆకుపచ్చ, గోధుమ. హనుమాన్‌ పూజలు మంచిది.

ధనుస్సు

పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పొందుతారు. మీ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్‌ ఎస్టేట్‌ల వారికి అనుకూల ఫలితాలు. వ్యాపార విస్తరణలో ముందుకు సాగుతారు, ఉద్యోగవర్గాలు నూతనోత్సాహంతో విధులు నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. ఐటీ నిపుణులకు విస్తృత అవకాశాలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు కుటుంబంలోగౌరవం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు… బంగారు, కాఫీ. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.

మకరం

కొత్త రుణయత్నాలు, ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో విరోధాలు. పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. దేవాలయాల సందర్శనం. రియల్‌ ఎస్టేట్‌ల వారికి నిరుత్సాహం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులు విధి నిర్వహణలో అప్రమత్తంగా మెలగాలి. రాజకీయ, పారిశ్రామికవర్గాలు నిరుత్సాహం చెందుతారు. ఐటీ నిపుణులకు సమస్యలు వేధిస్తాయి. విద్యార్థులకు అవకాశాలు దూరమవుతాయి. మహిళలకు కొంత గందరగోళంగా ఉంటుంది. షేర్ల విక్రయాలు నిరాశ పరుస్తాయి.

అదృష్ట రంగులు… గోధుమ, పసుపు. హనుమాన్‌ చాలీసా పఠించండి.

కుంభం

కుటుంబ సభ్యులతో అకారణంగా విరోధాలు. శ్రమాధిక్యంతో వ్యవహారాలు పూర్తి. ఆర్థికపరమైన చిక్కులు ఎదుర్కొంటారు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. కాంట్రాక్టులు అంతగా అనుకూలించవు. వ్యాపారాలలో తొందరపాటు వద్దు. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. పారిశ్రామిక,రాజకీయవేత్తలకు నిరుత్సాహం. ఐటీ నిపుణులకు వివాదాలు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కష్టమే. మహిళలకు కుటుంబ సమస్యలు. షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు… గోధుమ, తెలుపు. హనుమాన్‌కు అర్చనలు చేయండి.

మీనం

కొన్ని పనులు మధ్యలోనే విరమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధువులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు.. ఆలయ దర్శనాలు. రియల్‌ ఎస్టేట్‌ల వారికి ఒత్తిడులు తప్పవు. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులు అదనపు పనిభారం. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు వ్యవహారాలు ముందుకు సాగవు. ఐటీ నిపుణులు మరింత శ్రమపడాలి. విద్యార్థులకు అంతగా అనుకూలించదు. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు. షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.

అదృష్ట రంగులు… నీలం, ఆకుపచ్చ. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

ఫిబ్రవరి 14 గురువారం పంచాంగం

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఫిబ్రవరి 14 గురువారం ఉదయం 6.32- సాయంత్రం 5.57

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
విళంబినామ ఉత్తరాయణం శిశిర రుతువు మాఘమాసం-శుక్లపక్షం వైధృతి రాత్రి 2.24 వరకు తదుపరి విష్కంభం- కౌలువ ఉదయం 9.51 వరకు
తదుపరి తైతుల రాత్రి 9.13 వరకు తదుపరి గరజి
నవమి మధ్యాహ్నం 12.54 వరకు తదుపరి దశమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత ఘడియలు శుభసమయం
రోహిణి రాత్రి 10.01 వరకు తదుపరి మృగశిర మధ్యాహ్నం 2.10 నుంచి 3.44 వరకు, తెల్లవారి 3.21 నుంచి 4.23 వరకు ఉదయం 10.26 నుంచి 11.12, మధ్యాహ్నం 3.02 నుంచి 3.48 వరకు మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు మధ్యాహ్నం 2.24 నుంచి 3.59 వరకు ఉదయం 8.20 నుంచి 9.10, సాయంత్రం 5.00 నుంచి 5.40

 

రాశి ఫలాలు 14 ఫిబ్రవరి 2019 , daily horoscope in telugu 14th Feb 2019, daily horoscope in telugu 14th February 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 14 ఫిబ్రవరి 2019 ములుగు రాశి ఫలాలు, 14 ఫిబ్రవరి 2019 పంచాంగం, February 14th 2019 astrology in telugu, February 14th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu,
Please Read Disclaimer