రాశి ఫలాలు 15 ఆగస్టు 2019

0

రాశి ఫలాలు 15 ఆగస్టు 2019

Daily Horoscope in Telugu 15th August 2019

మేషం 
ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ఇంటాబయటా కొంత అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి.

వృషభం 
యత్న కార్యసిద్ధి పొందుతారు. సంఘంలోని ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. విందువినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. స్వల్ప ధనలాభాలు పొందుతారు.

మిథునం
ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి నిదానంగా పూర్తిచేస్తారు. బంధువులతో ఏర్పడిన స్వల్ప వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

కర్కాటకం
పాత మిత్రులతో కష్టసుఖాలు పంచుకుని ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.

సింహ
నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగ, వివాహయత్నాలు ఫలిస్తాయి.

కన్య
ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలు చేపడతారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. స్వల్ప ధనలాభాలు పొందుతారు.

తుల

ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. శ్రమ తప్పక పోవచ్చు. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.

వృశ్చికం
నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. బంధువులతో కష్టసుఖాలను పంచుకుంటారు. వస్తులాభం పొందుతారు.

ధనుస్సు
ఇంటర్వ్యూలు, పోటీపరిక్షలలో పాల్గొని విజయం సాధిస్తారు. రాబడి పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

మకరం
ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్పలాభాలు పొందుతారు.

కుంభం
రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి. సంతానం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు.

మీనం
కుటుంబసభ్యులు, చిన్ననాటి స్నేహితులను కలిసి శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్వల్ప ధనలాభాలు పొందుతారు.

ఆగస్టు 15 గురువారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఆగస్టు 15 బృహస్పతివాసరే ఉదయం 5.45- సాయంత్రం 6.26

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షాకాలం వర్ష రుతువు శ్రావణమాసం-శుక్లపక్షం సౌభాగ్యం మధ్యాహ్నం 12.46 వరకు తదుపరి శోభన- బవ సాయంత్రం 4.19 వరకు తదుపరి బాలువ తెల్లవారి 5.14 వరకు ఆ తదుపరి కౌలువ పౌర్ణమి సాయంత్రం 5.59 వరకు తదుపరి బహుళ పాడ్యమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
శ్రవణం ఉదయం 8.02 వరకు తదుపరి ధనిష్ఠ మధ్యాహ్నం 12.31 నుంచి 2.18 వరకు ఉదయం 10.05 నుంచి 10.56, మధ్యాహ్నం 3.09 నుంచి 3.59 వరకు మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు రాత్రి 10.45 నుంచి 12.31 వరకు ఉదయం 8.00 నుంచి 8.30, సాయంత్రం 4.30 నుంచి 5.00Please Read Disclaimer