రాశి ఫలాలు 1 ఆగస్టు 2019

0

రాశి ఫలాలు 1 ఆగస్టు 2019

Daily Horoscope in Telugu 1st August 2019

మేషం
ఇంటాబయటా ఒత్తిడులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

వృషభం
ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. కుటుంబసభ్యులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు ఆనుకూలంగా ఉంటుంది.

మిథునం
శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వస్తులాభాలు ఉన్నాయి.

కర్కాటకం
అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.

సింహ
వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఋణ బాధలు తప్పవు. పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

కన్య
సంఘంలో గౌరవం పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రాబడి పెరుగుతుంది. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందుతారు. స్వల్ప ధనలాభం ఉంది.

తుల

మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదురై చికాకులు పెడతాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వస్తులాభాలు ఉంటాయి.

వృశ్చికం
నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వాహన యోగం ఉంది.

ధనుస్సు
ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

మకరం
అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఇంటాబయటా చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. సంతానం నూతన సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు.

కుంభం
ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్దిపొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. వ్వాహనసౌఖ్యం ఉంది.

మీనం

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

ములుగు వారి ఆగస్టు 1 పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఆగస్టు 1 బృహస్పతివాసరే ఉదయం 5.42- సాయంత్రం 6.30

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-వర్షకాలం గ్రీష్మ రుతువు ఆషాడమాసం-బహుళపక్షం సిద్ధి సాయంత్రం 5.39 వరకు తదుపరి వ్యతీపాతం- నాగవ ఉదయం 9.07 వరకు 
తదుపరి కింస్తుఘ్నం రాత్రి 8.00 వరకు
అమావాస్య ఉదయం 8.41 వరకు తదుపరి శుక్లపక్ష పాడ్యమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
పుష్యమి మధ్యాహ్నం 12.11 వరకు తదుపరి ఆశ్లేష రాత్రి 11.33 నుంచి 12.58 వరకు ఉదయం 10.05 నుంచి 10.56, మధ్యాహ్నం 3.13 నుంచి 4.04 వరకు మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు ఉదయం 7.36 నుంచి 9.07 వరకు లేదు

ఆగస్టు 2019 పంచాంగం- పండుగలు, ప్రత్యేకతలు

 శ్రావణమాసం శుక్లపక్ష పాడ్యమి గురువారంతో ప్రారంభమై భాద్రపద శుక్లపక్ష పాడ్యమి ఆగస్టుతో ముగుస్తుంది. తెలుగు నెలల క్రమంలో ఐదో నెల శ్రావణమాసం ప్రారంభమయ్యేది ఆగస్టు 1నే. పన్నెండు తెలుగు నెలల్లో శ్రావణం ఐదోది. 

ఆషాడం మాసం నెల రోజులు పుట్టింట్లో ఉన్న కొత్త కోడలు అత్తవారింటికి శ్రావణంలో వస్తుంది. ఆషాడంలో ఆగిపోయిన శుభకార్యాలు, వివాహాలు శ్రావణంతో తిరిగి మొదలవుతాయి. పూజలు, నోములు, వ్రతాలకు శ్రావణం ప్రత్యేకత. ఈ మాసంలోనే గరుడ పంచమి, వరలక్ష్మి వ్రతం, అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా నిలిచే రాఖీ పూర్ణిమ, శ్రీవారి పవిత్రోత్సవాలు, నారాయణగిరిలో ఛత్రస్థాపనం, హయగ్రీవ జయంతి, శ్రీ విఖనస జయంతి, కృష్ణాష్టమి తదితర పండుగలు ఉన్నాయి. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. అత్తవారింట కొత్తకోడలతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. దీని వల్ల సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయిని నమ్మకం. 

రాశి ఫలాలు 1 ఆగస్టు 2019 , daily horoscope in telugu 1st August 2019, daily horoscope in telugu 1st August 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 1 ఆగస్టు 2019 ములుగు రాశి ఫలాలు, 1 ఆగస్టు 2019 పంచాంగం, August 1st 2019 astrology in telugu, August 1st 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,August 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer