రాశి ఫలాలు 20 మార్చి 2020

0

రాశి ఫలాలు 20 మార్చి 2020

Daily Horoscope in Telugu 20th March 2020

మేష రాశి

దీర్ఘకాలిక సమస్యలు, ఇబ్బందులు ఎదురుకావడంతో ఆందోళన చెందుతారు. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. షేర్లు, క్రయ విక్రయాలలో లాభాలు గడిస్తారు. కుటుంబంలో కీలక విషయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగవకాశాలు దక్కుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మహిళల సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలు కొలిక్కివస్తాయి. భార్యాభర్తల మధ్వ స్వల్ప విభేదాలు చోటుచేసుకుంటాయి. సంతానం వైఖరి చికాకు తెప్పిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. జీవితభాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

​వృషభ రాశి

ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా విజయవంతమవుతాయి. మానసిక ఆందోళన చెందుతారు. కష్టార్జితం వదులకునే సూచనలు ఉన్నాయి. శుభకార్యాల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విందు, వినోదాలలో పాల్గొంటారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు దక్కుతాయి. ఎవరి మనవాళ్లో గ్రహిస్తారు. విమర్శించిన వారే ప్రశంసలు కురిపిస్తారు. పేరు, ప్రతిష్ఠలను చూసి ఎదుటివారు అసూయ చెందుతారు. ప్రతి విషయంలోనూ ఆలోచించి ముందుకు సాగాలి.

మిథున రాశి

బంధువుల నుంచి శుభవార్తలు అందుకొంటారు. దీర్ఘకాలిక సమన్యల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. మహిళల నుంచి సహాయ సహకారాలు లభించడంతో లబ్ది పొందుతారు. రాజకీయ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకమైన మార్గంలో నడుస్తారు. సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇతరులకు సాయం చేసే గుణం మీకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది. స్నేహితుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. రుణాల ఇచ్చే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

​కర్కాటక రాశి

విలువైన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనులు, చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశాలు దక్కుతాయి. కొత్త వ్యాపారాలు విజయవంతమవుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మానసిక ఆందోళనలు నుంచి బయటపడతారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి.

సింహ రాశి

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. కీలక నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకొంటారు. దూరప్రాంతాల నుంచి అందిన వార్తలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరులను ధనసహాయం అర్ధించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉన్నత హోదాల్లో ఉన్న మహిళల నుంచి ప్రయోజనం పొందుతారు. మానసిక ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉన్నవారి నుంచి కీలక సమాచారం అందుతుంది. పెట్టుబడులు అనుకూలిస్తాయి. స్థిరాస్తి, భూములు, షేర్ల క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు.

​కన్య రాశి

పెద్దల సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తులాభం పొందుతారు. రాజకీయ రంగాలవారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వివాహాది, శుభకార్యాలు సానుకూలమవుతాయి. విందు, వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

తుల రాశి

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. అనుకోని అతిథుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్వల్ప ధనలాభం పొందుతారు. శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తారు. పెద్దలను గౌరవిస్తారు. ప్రతి పనిలోనూ ప్రత్యేకతను చాటుకుంటారు. సమాజంలో పేరు, ప్రతిష్ఠలు, గౌరవం దక్కుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

​వృశ్చిక రాశి

వివాహది శుభకార్యాల ఆలోచనలు, ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ రంగాలవారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. రుణాలు తీరడంతో మానసిక ప్రశాంతత పొందుతారు. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కొత్త పనులు చేపట్టి ఉత్సాహంగా పూర్తిచేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు, విభేదాలను పరిష్కరించుకొంటారు. పెట్టుబడులకు స్వల్ప లాభాలు పొందుతారు. సంతానానికి విద్య, ఉద్యోగవకాశాలు దక్కుతాయి. ప్రభుత్వ కార్యాలయాలో పనుల విషయంలో కొంత జాప్యం ఎదుర్కొంటారు. మన పనులను మనమే చేసుకోవాలనే తత్వం బోధపడుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి.

​ధనుస్సు రాశి

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి. పాత బాకీలు వసూలవుతాయి. వాహనయోగం పొందుతారు. పాతమిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాహాది శుభకార్యాలు సానుకూలమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆలోచించి ముందుకు సాగుతారు. సంతానం సంబంధం విషయంలో ఇబ్బందులు తొలగిపోతాయి. బంధువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. రాజకీయ పదవులు సంప్రాప్తిస్తాయి. పోటీ పరీక్షలలో విజయం దక్కే అవకాశం ఉంది. మానసికంగా బలంగా ఉంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురువుతాయి.

​మకర రాశి

కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. పెట్టుబడులకు తగిన సమయం. రాజకీయ పరమైన కోర్కెలు ఫలించే సూచనలు ఉన్నాయి. కొన్ని కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తిచేస్తారు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తారు. ఆర్దిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తువులు, పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మొండి బాకీలు వసూలవుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

కుంభ రాశి

ముఖ్యమైన పనులను సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. సామాజిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువులతో కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆందోళన నుంచి బయటపడతారు. శుభకార్యాలు, విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. విరోధులు సైతం మిత్రులుగా మారతారు. విదేశాల్లోని బంధువులకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది.

మీన రాశి

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రారంభించిన పనులలో విజయం దక్కుతుంది. బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. బలవంతులకు ఎదురెళ్లి కోరి సమస్యలను కొని తెచ్చుకోవద్దు. సంతాన సంబంధ విషయంలో ఆందోళన చెందుతారు. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. కొత్త విషయాలను గ్రహిస్తారు.

మార్చి 20 శుక్రవారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
మార్చి 20 భృగువాసరే ఉదయం 6.13- సాయంత్రం 6.06

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం ఉత్తరాయణం-వేసవికాలం శిశిర రుతువు ఫాల్గుణమాసం-బహుళపక్షం శివం మధ్యాహ్నం 1.32 వరకు తదుపరి సిద్ధం- బాలువ ఉదయం 7.47 వరకు తదుపరి కౌలువ రాత్రి 8.15 ఆ తదుపరి తైతుల ద్వాదశి పూర్తి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
శ్రవణం సాయంత్రం 5.05 వరకు తదుపరి ధనిష్ఠ రాత్రి 9.31 నుంచి 11.17 వరకు ఉదయం 8.38 నుంచి 9.26 వరకు తిరిగి మధ్యాహ్నం 12.38 నుంచి 1.26 వరకు ఉదయం 10.30 నుంచి 12.00 వరకు ఉదయం 7.37 నుంచి 9.18 వరకు ఉదయం 6.30 నుంచి 7.00 తిరిగి సాయంత్రం 5.40 నుంచి 6.15

రాశి ఫలాలు 20 మార్చి 2020 , daily horoscope in telugu 20th Mar 2020, daily horoscope in telugu 20th March 2020, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 20 మార్చి 2020 ములుగు రాశి ఫలాలు, 20 మార్చి 2020 పంచాంగం, March 20th 2020 astrology in telugu, March 20th 2020 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,March 2020 Telugu Panchangam ,Horoscope 2020 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-