రాశి ఫలాలు 22 ఫిబ్రవరి 2019

0

రాశి ఫలాలు 22 ఫిబ్రవరి 2019

Daily Horoscope in Telugu 22nd Feb 2019

మేషం
మిత్రులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. శ్రమ మీది ఫలితం వేరొకరిది అవుతుంది. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా ఋణాలు తీరుస్తారు. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపడతారు. సంతానం నుంచి కీలక సమాచారం అందుతుంది. ధనలాభం ఉంది.

వృషభం 
దూర ప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్ధిక ప్రగతి సాధిస్తారు. విందువినోదాలలో పాల్గొంటారు. వస్తులాభం ఉంది. పారిశ్రామిక, రాజకీయ రంగాలవారికి సన్మాన యోగం. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. సంతాన సమస్యల నుంచి బయటపడతారు.

మిథునం

కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనుకోని విధంగా అతిథులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థికపరిస్థితి లాభిస్తుంది. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం
ప్రయాణాలు లాభిస్తాయి. నూతన వ్యాపారాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ఆర్ధికలావాదేవీలు లాభిస్తాయి. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు.

సింహం
శ్రమించినా ఫలితం ఉండదు. ఋణాలు కొంతవరకు తీరుస్తారు. దూర ప్రాంతాల నుంచి అందిన ఓ వార్తతో సంతోషం కలుగుతుంది. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు, ధనలాభం ఉంది.

కన్య
నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సన్నిహితుల సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్ధిక ప్రగతి సాధిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

తుల
జీవితభాగస్వామితో ఏర్పడిన విబేధాలను పరిష్కరించుకుంటారు. ప్రయాణాలలో తొందరపాటు తగదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సోదరుల సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన సమస్యల నుంచి బయటపడతారు. వాహన సౌఖ్యం ఉంది.

వృశ్చికం
రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి సన్మాన యోగం. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. దూరప్రాంతాల నుంచి వచ్చిన వార్త సంతోషం కలిగిస్తుంది. సంతానం నుంచి కీలక సమాచారం అందుకుంటారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆహ్వానాలు అందుకుంటారు.

ధనుస్సు
భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. సోదరులతో ఎదురైన ఆస్థి వివాదాలు తీరడంతో కొంత ఊరట కలిగిస్తుంది. విలువైన ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి.

మకరం

ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం. వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులను కలుకుంటారు.

కుంభం
వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. జీవితభాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. వస్తులాభం ఉంది.

మీనం
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది.సన్నిహితుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. సోదరుల సలహాతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. క్రయవిక్రయాలు లాభిస్తాయి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు ఉన్నాయి.

ఫిబ్రవరి 22 శుక్రవారం పంచాంగం

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఫిబ్రవరి 22 శుక్రవారం ఉదయం 6.28- సాయంత్రం 6.00

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
విళంబినామ ఉత్తరాయణం- శీతాకాలం శిశిర రుతువు మాఘమాసం-బహుళపక్షం శూలం రాత్రి 12.12 వరకు తదుపరి గండం- భద్ర/విష్ఠి మధ్యాహ్నం 3.24 వరకు తదుపరి బవ రాత్రి 2.29 వరకు తదుపరి బాలువ తదియ ఉదయం 10.49 వరకు తుదుపరి చవితి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత ఘడియలు శుభసమయం
హస్త రాత్రి 10.18 వరకు తదుపరి చిత్త ఉదయం 10.05 నుంచి 11.33 వరకు ఉదయం 8.52 నుంచి 9.38 వరకు, మధ్యాహ్నం 12.44 నుంచి 1.30 వరకు ఉదయం 10.30 నుంచి 12.00 వరకు రాత్రి 11.33 నుంచి 1.04 వరకు ఉదయం 9.45 నుంచి 10.00, సాయంత్రం 5.00 నుంచి 5.20

రాశి ఫలాలు 22 ఫిబ్రవరి 2019 , daily horoscope in telugu 22nd Feb 2019, daily horoscope in telugu 22nd February 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 22 ఫిబ్రవరి 2019 ములుగు రాశి ఫలాలు, 22 ఫిబ్రవరి 2019 పంచాంగం, February 22nd 2019 astrology in telugu, February 22nd 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu,




Please Read Disclaimer