రాశి ఫలాలు 6 మార్చి 2020

0

రాశి ఫలాలు 6 మార్చి 2020

Daily Horoscope in Telugu 6th March 2020

మేష రాశి

కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు, సమస్యలను పరిష్కరించుకొంటారు. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. గృహనిర్మాణ విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందుకు సాగడం ఉత్తమం. వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తగదు. ఉద్యోగులకు పదోన్నతులు, హోదాలు పెరిగే సూచనలు ఉన్నాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలకు పరిష్కారం లభించే సూచనలు ఉన్నాయి.

​వృషభ రాశి

బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యాలు, విందు, వినోదాలలో పాల్గొంటారు. యత్నకార్యసిద్ధి పొందుతారు. సంఘంలో పేరు ప్రతిష్ఠలు, పరపతి పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంతానానికి నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. ఇతరుల విషయాలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇతరుల సహాయసహకారం లేకుండానే ఆదాయ మార్గాలను పొందుతారు.

​మిథున రాశి

సంఘంలో గౌరవం, ఆదరణ పొందుతారు. ముఖ్యమైన పనులు, ప్రారంభించిన వ్యవహారాలలో విజయం దక్కుతుంది. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలను విస్తరించాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. స్థిరాస్తి విషయాలు, షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కుటుంబంలో ఎదురైన సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. రక్త సంబంధీకులను కలుసుకుంటారు. అదృష్టం పైన ఆధారపడటం మంచిది కాదు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు.

​కర్కాటక రాశి

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటంతో రుణాలు కొంత వరకు తీరుస్తారు. మానసిక ప్రశాంతత నెలకుంటుంది. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. ఇంటాబయటా బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలలో కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు నడిపే విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించి లాభాలు పొందుతారు. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

​సింహ రాశి

సంఘంలో ప్రముఖలతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్ధికంగా అభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకొంటారు. ఉద్యోగాలలో ఎదురైన చికాకులు, సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం విషయంలో, వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యానికి సమయం కేటాయిస్తారు. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

​కన్య రాశి

చేపట్టిన పనులలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమయంలో సహాయసహకారాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. బంధువుల నుంచి అందిన శుభ ఆహ్వానాలు సంతోషానికి కారణమవుతాయి. సంతానానికి విద్యా, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. బిజీగా ఉన్నా అలసటను సులువుగా జయిస్తారు

​తుల రాశి

బంధువులతో ఏర్పడిన వివాదాలు, విబేధాలను పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలు, స్థిరాస్తి వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్పలాభాలు పొందుతారు. అనుకోని విధంగా అతిథులను కలుసుకుంటారు. విశాల దృక్పథంతో ముందుకు సాగితే కొన్ని అవకాశాలు దరిచేరుతాయి.

వృశ్చిక రాశి

మిత్రుల నుంచి ఒత్తిడి పెరిగినా అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయటా చికాకులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు గడిస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కోనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, వ్యాపారాలలో తగినంత లాభాలను పొందుతారు.

​ధనుస్సు రాశి

సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు. భూ, స్థిరాస్తి, వాహనయోగాలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఖర్చుల పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించాలి.

​మకర రాశి

చేపట్టిన పనులు, ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఏర్పడిన అధిగమించి ముందుకు సాగుతారు. దూర ప్రాంతాల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటాబయటా చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. స్వల్ప ధనలాభం పొందుతారు. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శ్రమ, సమాయానికి కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలను సాధిస్తారు.

​కుంభ రాశి

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. సన్నిహితుల నుంచి ముఖ్యమైన విషయాలను గ్రహిస్తారు. సమాజంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. దూరప్రాంతాల నుంచి అందిన వార్త కుటుంబంలో సంతోషానికి కారణం అవుతుంది. సంతానానికి నూతన ప్రయత్నాలు, ఉద్యోగవకాశాలు ఫలించే సూచన ఉంది. జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది.

మీన రాశి

చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా మిత్రుల సాయం అందుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనలాభం పొందుతారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వాహనయోగం పొందుతారు. బంధువుల నుంచి ధనలాభం పొందుతారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ప్రారంభించిన నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ అభిప్రాయాలనుస్నేహితులు, బంధువులపైన రుద్దకండి.

మార్చి 6 గురువారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
మార్చి 6 భృగువాసరే ఉదయం 6.21- సాయంత్రం 6.03

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం ఉత్తరాయణం-వేసవికాలం శిశిర రుతువు ఫాల్గుణమాసం-శుక్లపక్షం శోభన రాత్రి 1.34 వరకు తదుపరి భద్ర ఉదయం 7.19 వరకు – భవ రాత్రి 6.42 వరకు ఏకాదశి ఉదయం 11.56 వరకు తదుపరి ద్వాదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
పునర్వసు ఉదయం 10.38 వరకు తదుపరి పుష్యమి సాయంత్రం 6.07 నుంచి 7.37 వరకు ఉదయం 8.46 నుంచి 9.33 వరకు తిరిగి మధ్యాహ్నం 12.42 నుంచి 1.29 వరకు ఉదయం 10.30 నుంచి 12.00 వరకు రాత్రి 11.50 నుంచి1.24 వరకు ఉదయం 6.00 నుంచి 6.30 తిరిగి సాయంత్రం 7.45 నుంచి 8.15 వరకు

రాశి ఫలాలు 06 మార్చి 2020 , daily horoscope in telugu 06th Mar 2020, daily horoscope in telugu 06th March 2020, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 6 మార్చి 2020 ములుగు రాశి ఫలాలు, 06 మార్చి 2020 పంచాంగం, March 06th 2020 astrology in telugu, March 06th 2020 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,March 2020 Telugu Panchangam ,Horoscope 2020 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-