Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఏపీ సచివాలయం – అసెంబ్లీలో కరోనా కల్లోలం!!

ఏపీ సచివాలయం – అసెంబ్లీలో కరోనా కల్లోలం!!


ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ప్రతీరోజు 10వేల కేసులు చొప్పున బయటపడుతున్నాయి. కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తున్నప్పటికీ సచివాలయం అసెంబ్లీలో ఉద్యోగులు పనిచేస్తూనే ఉన్నారు.

తాజాగా నిన్న ఒక్కరోజే ఏపి పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఏకంగా 19 కేసులు బయటపడడం కలకలం రేపింది. దీంతో సచివాలయంలో మొత్తం కేసుల సంఖ్య 138కి చేరింది. దీంతో ఉద్యోగులు సచివాలయానికి రావాలంటేనే భయపడిపోతున్నారు.

ఇక సచివాలయంలో కరోనా ఎఫెక్ట్ తో మంత్రులు ఇటు వైపే రావడం లేదు. చివరికి భద్రతాకారణాలతో సచివాలయం అసెంబ్లీ ఎంట్రీ గేట్లను కూడా అధికారులు మూసివేయడం గమనార్హం. కేవలం అత్యవసర విధుల్లో ఉన్న ఉద్యోగులకు మాత్రమే ప్రత్యేక అనుమతులతో వారి బ్లాకుల్లోకి అనుమతిస్తున్నారు. మిగతా వారిని వర్క్ ఫ్రం హోం ఇస్తున్నారు.

కాగా ప్రభుత్వం మొదట్లో కరోనా చర్యలు బాగా చేపట్టిందని.. ఇప్పుడు శానిటైజర్లు మాస్కులు కూడా అందుబాటులో లేవని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తమకు సెలవులు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.