కరోనా టెస్టుల కోసం హైదరా‘బాధ’!

0

మహానగరం హైదరాబాద్ లో కరోనా కష్టాలకు నిదర్శనమీ చిత్రాలు.. కరోనా టెస్టుల కోసం ఉదయం 5 గంటల నుంచే క్యూలు కడుతున్న దైన్యం హైదరాబాద్ లో కనిపిస్తోంది. గంటల కొద్దీ క్యూలో నిలబడలేక తమ స్థానాల్లో హెల్మెట్లు చెప్పులు పెట్టి క్యూలో తమ స్థానాన్ని పదిలంగా ఉంచుకుంటున్నారు.హైదరాబాద్ లోని సరోజినీదేవి ఆస్పత్రిలో ర్యాపిడ్ యాంటీజన్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీంతో జనాలు పోటెత్తుతున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే క్యూలో నిలబడుతున్నారు. చెప్పులు హెల్మెట్లు క్యూలో పెట్టి పక్కన చెట్ల కింద సేదతీరుతున్నారు.నిత్యం సరోజనీదేవి ఆస్పత్రిలో 300మంది పరీక్షల కోసం వస్తున్నట్టు వైద్యులు తెలిపారు. కానీ వారిలో 200 మందికే శాంపిల్స్ సేకరణ సాధ్యమవుతోంది. రోగులు పెరుగుతుండడంతో శాంపిల్స్ సేకరణ పెరుగుతోంది.

ఇక హైదరాబాద్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా కరోనా రాపిడ్ పరీక్షలు చేస్తున్నారు. దీంతో ఎక్కడి వారు అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయించుకుంటున్నారు. పాజిటివ్ వచ్చిన వారికి హోం ఐసోలేషన్ కిట్స్ లేదంటే వెళతామంటే గాంధీకి పంపిస్తున్నారు.