విజయ నిర్మల అంత్యక్రియల్లో జాప్యం

0

ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మల అంతిమ సంస్కరాలు ఆలస్యం అవుతున్నాయి. దాదాపు వందల సినిమాల్లో నటించి 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్ లో విజయ నిర్మల స్థానం సంపాదించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల గుండెపోటుతో బుధవారం రాత్రి మరణించారు.

విజయనిర్మల మరణించిందని తెలిసి ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ నటులు చిరంజీవి మోహన్ బాబు తెలుగు సినిమా ప్రముఖులు వచ్చి నివాళులర్పించారు. విజయ నిర్మల దహనసంస్కారాలను ఆమె ఎంతో ఇష్టంగా కొని తీర్చిదిద్దిన చిలుకూరులోని విజయ్ కృష్ణ గార్డెన్ ఫాంహౌస్ లో శుక్రవారం నిర్వహిస్తున్నారు.

అయితే అంతిమ సంస్కార ఏర్పాట్లలో ఆలస్యం కావడం.. పైగా ఏపీ సీఎం జగన్ నివాళులర్పించడానికి వస్తున్నారన్న సమాచారంతో విజయ నిర్మల భౌతిక కాయాన్ని నానక్ రాంగూడలోని ఆమె నివాసంలోనే ఉంచారు. ఇక ఫిలించాంబర్ కు సినీ ప్రముఖుల దర్శనార్థం తరలించకుండా నేరుగా చిలుకూరు ఫాంహౌస్ కు తరలిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్ ఈ ఉదయం విజయ నిర్మల భౌతిక ఖాయానికి నివాళులర్పించి సూపర్ స్టార్ కృష్ణను ఓదార్చారు. అనంతరం వేలాది అభిమానులు సినీ ప్రముఖులు వెంటరాగా పూలరథంపై విజయ నిర్మల దేహాన్ని చిలుకూరుకు తరలిస్తున్నారు. ఈ సాయంత్రంలోపు ఆమె అంతిమ సంస్కరాలను పూర్తి చేయబోతున్నారు.
Please Read Disclaimer