మోదీతో భేటీ.. అది ఇప్పుడు చెప్పనంటూ దండం పెట్టిన మోహన్ బాబు

0

సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత మంచు మోహన్ బాబు కుటుంబ సమేతంగా సోమవారం ప్రధాని మోదీని కలవడం రాజకీయ వర్గాల్లో, సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. జగన్‌తో దగ్గరి బంధుత్వం ఉన్న ఆయన.. బీజేపీలో చేరతారేమో అనే ఊహాగానాలు బయల్దేరాయి. గతంలోనూ మోదీని కలిసిన మోహన్ బాబు.. తాజాగా మరోసారి ప్రధానిని కలిసిన తర్వాత.. ఈ భేటీ విషయమై మోహన్ బాబు స్పందించారు. ప్రధానితో భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదన్న ఆయన.. తిరుపతిలో ఉన్న తమ విద్యాసంస్థలను సందర్శించాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు.

మిమ్మల్ని ప్రధాని మోదీ బీజేపీలోకి ఆహ్వానించారా? అనే ప్రశ్నకు మోహన్ బాబు నవ్వుతూ సమాధానం దాటేశారు. త్వరలోనే దక్షిణాది నటులను కలుస్తానని ప్రధాని చెప్పారని కలెక్షన్ కింగ్ తెలిపారు.

ప్రధానితో భేటీ అనంతరం.. వాట్ ఏ మ్యాన్ అని మోహన్ బాబు ట్వీట్ చేయగా.. ప్రధాని మోదీ బదులిస్తూ.. మోహన్ బాబూ.. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను కలవడం ఆనందంగా ఉందన్నారు. సినిమా రంగ ప్రాధాన్యం సహా అనేక అంశాల గురించి తాము చర్చించామని ప్రధాని తెలిపారు. ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలను ఎలా బలోపేతం చేయగలమో చర్చించామన్నారు.
Please Read Disclaimer