ఫృథ్వీషా డోపింగ్ వివాదంలో భారీ ట్విస్ట్

0

భారత యువ క్రికెటర్ ఫృథ్వీ షా డోపింగ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అతడు డోప్ టెస్ట్ లో దొరికిపోవడంతో అందరూ అతడు దోషి అంటూ ఆడిపోసుకున్నారు. కానీ అసలు నిజం బయటపెట్టాక అయ్యో పాపం అన్నారు.

ఇటీవల బీసీసీఐ నిర్వహించిన డోప్ టెస్ట్ లో ఫృథ్వీ షా నిషేధిత డ్రగ్ తీసుకున్నాడని తెలియడంతో అతడిని 8 నెలల నిషేధాన్ని బీసీసీఐ విధించింది. దీనిపై బీసీసీఐ యాంటీ డోపింగ్ మేనేజర్ అభిజిత్ సాల్వే విచారణ చేయించాడు. ఇందులో దగ్గు జలుబుతో బాధపడుతున్న ఫృథ్వీ షాకు అతడి తండ్రి సలహా మేరకు మెడికల్ షాప్ లో సిరప్ తీసుకున్నాడని.. ఆ సిరప్ తొందరగా రిలీఫ్ ఇస్తుందని చెప్పడంతో వాడాడని.. అందులో నిషేధిత డ్రగ్ ఉండడంతో ఇలా పొరపాటున దొరికిపోయాడని తెలిపాడు.. ఇదే రిపోర్టును డోపింగ్ మేనేజర్ అభిజిత్ సాల్వే మీడియాకు తెలిపాడు. దీంతో ఆ మాత్రం చూసుకోవా అంటూ ఫృథ్వీషాపై సానుభూతి వ్యక్తమైంది.

అయితే ఇప్పుడీ వివాదంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఫృథ్వీ షా ఆడుతున్న ముంబై జట్టు కోచ్ వినాయక్ సామంత్ ఫిజియో దీప్ తోమర్ మాత్రం సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అసలు ఫృథ్వీ షా అసలు దగ్గు జలుబుతో బాధపడలేదని స్పష్టం చేశారు. అతడికి స్వల్ప జ్వరం వచ్చిందని.. దగ్గు – జలుబు నివారణ కోసం మందు ఇవ్వాలని కూడా మమ్మల్ని అడగలేదని.. అతడు చెబుతున్నది అబద్ధమంటూ బాంబు పేల్చారు. అయినా జాతీయ క్రికెటర్ కు ఏ మందు తీసుకోవాలో ఏమందు తీసుకోకూడదో ఆ మాత్రం తెలియదా అని వారు సందేహాలు వ్యక్తం చేశారు.

దీంతో ఫృథ్వీ షా డోపింగ్ టెస్ట్ పై మరిన్ని అనుమానాలు చెలరేగాయి. బీసీసీఐ కావాలనే షాను కాపాడేందుకే ఈ దగ్గు – జలుబు సిరప్ మాట డ్రామా ఆడిస్తుందా అన్న సందేహాలు వెలువడుతున్నాయి. నిజంగా ఫృథ్వీషా డోపింగ్ లో దొరికేశాడా అన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.
Please Read Disclaimer