రికార్డుల మొనగాడు.. కెప్టెన్ గా ఆటగాడిగా కీపర్ గా అన్నింటా ధోని రికార్డులే

0

Dhoni King of Records in Cricket

Dhoni King of Records in Cricket

ధోని రికార్డుల రారాజుగా పేరు పొందాడు. ఆటగాడిగా కెప్టెన్ గా కీపర్ గా ధోని సాధించిన రికార్డులు మరెవ్వరూ సాధించలేదు. తాను ఆడిన మూడు ఫార్మాట్ల క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ ధోని పలు రికార్డులు సాధించాడు. భారత జట్టు గమనాన్నే మార్చేశాడు. వన్డేల్లో వికెట్ కీపర్ గా గిల్ క్రిస్ట్ సాధించిన అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొడుతూ శ్రీలంకపై ధోని అత్యధికంగా 183 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధిక మ్యాచులకు నాయకత్వం వహించి రికార్డు నెలకొల్పాడు. అత్యధిక వన్డే పరుగులు సాధించిన భారత కెప్టెన్ గా నిలిచాడు. ధోని కెప్టెన్ గా 200 మ్యాచుల్లో 6641 పరుగులు చేశాడు.

కెప్టెన్గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు ధోనీనే. అతడి మొత్తం సిక్సుల సంఖ్య 204. భారత్ కు అత్యధిక విజయాలు కట్టబడిన ఆటగాడిగా ధోనీ రికార్డు సాధించాడు. 332 మ్యాచులకు సారథ్యం వహించిన ధోని అత్యధికంగా 178 విజయాలు సాధించాడు. ఎన్నో రికార్డులు సాధించిన సచిన్ టెండూల్కర్ కు జీవితంలో ఉన్న ఒకే ఒక లోటు వరల్డ్ కప్ సాధించడం. 2011 వరల్డ్ కప్ గెలిచిన మహీ సచిన్ ను సగర్వంగా ఇంటికి పంపించాడు. ఐసీసీ లోని అన్ని టైటిళ్ళను గెలిచిన సత్తా ధోని సొంతం. ఛాంపియన్స్ ట్రోఫి వరల్డ్ కప్ టీ 20 వరల్డ్ కప్ పలు ఆసియా కప్ లను ధోని గెలిచాడు.

అన్ని ఫార్మాట్లలో భారతజట్టును నెంబర్వన్ స్థానంలో నిలిపాడు. ఇక కీపర్ గా ధోనీ సాధించిన రికార్డులు మరే కీపర్ సాధించలేదు. కీపర్ గా మెరుపువేగం ధోని సొంతం.క్రిజ్ లో బాట్స్మెన్ అలా కాలు గాల్లోకి లేపితే చాలు రెప్పపాటులో స్టంపింగ్ చేసేయ గలడు. మొత్తం 538 మ్యాచ్ లలో 195 స్టంప్ అవుట్లు చేశాడు. 634 క్యాచ్ లు అందుకున్నాడు. ఇక ఐపీఎల్ లోనూ ధోని తనదైన ముద్ర వేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ కి మూడు సార్లు టైటిల్ అందించాడు. చాంపియన్స్ లీగ్లో రెండుసార్లు కప్పు అందుకున్నాడు. ఐపీఎల్లో కెప్టెన్ గా అత్యధిక విజయాలు అందుకున్న వాడు కూడా ధోనీనే..