Templates by BIGtheme NET
Home >> Telugu News >> బయటపడ్డ వజ్రాలు.. ఎగబడుతున్న జనం.. షాకైన ప్రభుత్వం

బయటపడ్డ వజ్రాలు.. ఎగబడుతున్న జనం.. షాకైన ప్రభుత్వం


ఫ్రీగా వస్తుందంటే దేన్ని వదలరు మన జనాలు.. అలాంటిది వజ్రాలు దొరుకుతున్నాయంటే వదులుతారా? బొగ్గుగనిలో వజ్రాలు దొరకుతుండడంతో జనం ఎగబడ్డారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు తండోపతండాలుగా వచ్చి వెతకడం ప్రారంభించారు. ఈ వింత నాగాలాండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లో నాణ్యమైన బొగ్గుగనులు విస్తారంగా ఉన్నాయి. అయితే ఈ బొగ్గు గనుల్లో తవ్వకాలు జరుపుతుండగా వజ్రాలు బయటపడ్డాయని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ప్రజలంతా వచ్చి బొగ్గు గనుల్లో వజ్రాలు వెతకడం ప్రారంభించారు.

మోన్ జిల్లా శివారు ప్రాంతంలోని వాంచింగ్ వద్ద ఉన్న బొగ్గుగనిలో ఈ నెల 25వ తేదిన ఓ వ్యక్తికి మెరుస్తూ ఉన్న రాళ్లూ దొరికాయి. అవి వజ్రాల మాదిరిగా ఉండడంతో వార్త బయటకు వచ్చింది.

దీంతో జనం దావనంలా వచ్చి గ్రామంలో తవ్వకాలు జరపడం మొదలుపెట్టారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నివేదిక ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

మెరుస్తున్న రాళ్లు వజ్రాలు లేదంటే క్వార్టజ్ శిలలా అన్నది శాస్త్రవేత్తలు నిగ్గుతేలుస్తున్నారు. ఇప్పటికే నాగాలాండ్ లోని బొగ్గు గనుల్లో వజ్రాలు బయటపడే అవకాశం ఉందని భూగర్భగని శాస్త్రవేత్తలు సైతం ప్రకటించడంతో ఇప్పుడు వాంచింగ్ గ్రామానికి జనాలు పోటెత్తుతున్నారు.