కరోనాతో చైనాలో చనిపోయింది 25వేల మందా?

0

సంచలన కథనాన్ని ప్రచురించింది చైనాకు చెందిన ఒక సంస్థ. చైనా అధ్యక్షుడు స్వయంగా కరోనా వైరస్ ను పిశాచితో పోలుస్తూ.. దానితో తాము యుద్ధం చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటివరకూ ఈ వైరస్ కారణంగా 575 మంది వరకూ మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. పాతికవేల మంది వరకూ అనుమానితులు ఉన్నట్లుగా చైనా చెబుతోంది. అయితే.. ఇవేమీ నిజం కాదని చెబుతోంది టెన్సెంట్ అనే సంస్థ.

ఈ సంస్థ చెప్పిన వివరాల ప్రకారం పాతిక వేల మంది వరకూ చైనీయులు కరోనా కారణంగా మరణించారన్న షాకింగ్ వాదనను తెర మీదకు తీసుకొంది. ఈ సంస్థ లెక్కల ప్రకారం 24589 మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయారని.. అయితే చైనా ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా పాతిక వేల మంది ఇబ్బంది పడుతున్నట్లుగా చేస్తున్న ప్రకటనలు నిజం కావంటున్నారు.

వాస్తవానికి వైరస్ సోకిన వారు 1.54లక్షల మంది అని టెన్సెంట్ చెబుతోంది. ఈ నెల మొదటి తేదీన చైనా అధికారులు చెప్పిన కరోనా బాధితుల సంఖ్యకు వాస్తవానికి అస్సలు పొంతనే లేదన్నారు. అయితే.. ఈ కథనాన్ని ఖండిస్తూ చైనీయులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడీ వాదన తీవ్రమైన భయాందోళనల్ని రేపుతోంది.

మరో విషయం ఏమిటంటే.. సాధారణ రోజుల్లోనే చైనాకు సంబంధించిన చాలా వార్తలు బయటకు రావు. అక్కడి ప్రజల భయాందోళనల్ని బయటపెట్టేంత దమ్మున్న మీడియా చైనాలో ఉందని.. ప్రభుత్వం విధించే పరిమితులకు లోబడి పని చేస్తాయే తప్పించి.. సొంతంగా.. నిజం ఇదంటూ ప్రపంచానికి చెప్పే అలవాటు.. దమ్ము చైనాకు చెందిన చాలా మీడియా హౌస్ లకు లేదన్న మాట వినిపిస్తోంది. చైనా అధికారిక ప్రకటన చేసే వరకూ ఇలాంటి కన్ఫ్యూజన్ తప్పదు.

Comments are closed.