సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

కేజ్రీవాల్ ప్రశ్నకు రిప్లై ఇవ్వకపోవటమే బీజేపీని ఓడించిందట

0

దగ్గర దగ్గర తొమ్మిది నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ రాష్ట్ర పరిధిలోని ఏడు ఎంపీ స్థానాల్లో ఏడింటిని సొంతం చేసుకొని క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ.. తాజా ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలైంది? విజయం పక్కా అన్న ధీమాను కమలనాథులు వ్యక్తం చేసినా.. ఆ పార్టీకి అనుకూలంగా ఎందుకు ఫలితం రాలేదన్న ప్రశ్నకు సోషల్ మీడియాలో అప్పుడే విశ్లేషణలు షురూ అయ్యాయి.

ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణం.. ఆ పార్టీ అధినాయకత్వం చేసిన తప్పులేనని తేలుస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో ఆసక్తికర విశ్లేషణ సాగుతోంది. ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ సీఎంగా కేజ్రీవాల్ క్లారిటీగా ఓటర్లకు తెలిసి ఉండటం.. అదే సమయంలో బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయాన్ని చెప్పక పోవటం కూడా ఓడి పోవటానికి కారణంగా చెబుతున్నారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ ప్రకటించి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ బలహీనతను గుర్తించిన కేజ్రీవాల్ తన ఎన్నికల ప్రచారంలోనూ.. సోషల్ మీడియా ద్వారానూ.. బీజేపీకి తాను ఒక ప్రశ్నను సూటిగా సంధిస్తున్నానని.. దమ్ముంటే ఆ పార్టీ ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా వెల్లడించాలని సవాలు చేసింది. దీనికి.. బీజేపీ సమాధానం ఇవ్వలేక మౌనం దాల్చింది. ఇది ఆమ్ ఆద్మీకి మేలు చేకూరిస్తే.. సీఎం అభ్యర్థి ఎవరన్న విషయం పై క్లారిటీ ఇవ్వని కమలనాథులు బొక్కబోర్లా పడ్డారని చెబుతున్నారు. మరి.. ఈ విశ్లేషణ పై బీజేపీ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.
Please Read Disclaimer