మోహన్ బాబుకు జగన్ తో చెడిందా?

0

ఎన్నికలకు ముందు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిల కోసం రోడెక్కి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆయన జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున అక్కడక్కడా ప్రచారం కూడా నిర్వహించారు. అయితే ఏమైందో ఏమో గానీ ఎన్నికల తరువాత పార్టీలో యాక్టీవ్ గా లేరు. ఇప్పుడు ఉన్నట్టుంది ఆయన బీజేపీలో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. బీజేపీలో జాయిన్ కావాలని మోహన్ బాబుకి మోడీ ఆహ్వానం పలికారని ఆయన మనుషులు కొందరు మీడియాకు సమాచారం ఇచ్చారని తెలిసింది. దీనితో ఢిల్లీలోని ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో ఆయనతో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, విరోనిక, మంచు లక్ష్మి సమావేశం అయ్యారట. ఈ పరిణామం ఆశ్చర్యపరచేలాగే ఉంది.

ఇంత స్వల్ప కాలంలో మోహన్ బాబుకు జగన్ మోహన్ రెడ్డికి ఎక్కడ చెడి ఉంటాడా అని అందరూ చర్చించుకుంటున్నారు. ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనకు అనుకూలమైన సినీ సెలెబ్రిటీలకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. అయితే మోహన్ బాబు విషయంలో మాత్రం అలాంటిది ఏమీ జరగలేదు. ఆయనకు టీటీడీ ఛైర్మన్ పోస్టు ఇవ్వనున్నారని ఒక దశలో ప్రచారం జరిగినా తాను రేస్ లో లేను అని ఆయనే చెప్పుకొచ్చారు.
Please Read Disclaimer