జులై 1 తొలి ఏకాదశి రోజు 7 రావి ఆకులతో ఇలా చేయండి

0

జులై 1వ తేదీన తొలి ఏకాదశి. తొలి ఏకాదశి హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు. శ్రీ మహావిష్ణువు పాల కడలిపై నిద్రకుపక్రమించే ఈ రోజునే తొలి ఏకాదశి అని అంటారు. తొలి ఏకాదశి నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి రోజు తిరిగి వస్తాడు అని పురాణాల్లో ఉంది. అయితే తొలి ఏకాదశి శనివారం లేదా బుధవారం వస్తే.. చాలా విశేషం అని చెప్పాలి. ఈ సారి తొలి ఏకాదశి బుధవారం రోజు వచ్చింది. శ్రీ మహా విష్ణువుకు ఎంతో ప్రీతి కరమైన రావి ఆకుతో… ఈ తొలి ఏకాదశి రోజున ఇలా కనుక చేశారు అంటే మీకున్న సకల కష్టాలు తొలగిపోయి సకల సుఖాలు సిరిసంపదలు.. మీ సొంతం అవుతాయి. తొలి ఏకాదశి రోజున రావి ఆకు తో ఏం చేయాలో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం…

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. రావి చెట్టు ని శ్రీ మహావిష్ణువు కి ప్రతిరూపంగా భావిస్తారు. రావి చెట్టు ఎక్కడ ఉన్నా అందులో ఆ శ్రీమహావిష్ణువు తప్పక కొలువై ఉంటాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ఈ విషయాన్ని లక్ష్మీదేవి అక్క జేష్టాదేవి కి వివరిస్తారు. జేష్టాదేవి పెళ్లయిన తర్వాత ఆమె యొక్క స్వభావాన్ని అంటే అపరిశుభ్రత దుర్గంధం చెడు భావన.. ఇవన్నీ జేష్టాదేవి ఇష్టం అని తెలుసుకున్నా జేష్టా దేవి భర్త ఆమెని రావి చెట్టు మొదట్లో విడిచిపెట్టి మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోతాడు. భర్త వదిలి పెట్టి వెళ్లడంతో జేష్టాదేవి అక్కడ బిగ్గరగా ఏడుస్తూ ఉంటుంది.. ఆ ఏడుపు విని లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు జేష్టాదేవి వద్దకి పరుగుపరుగున వస్తారు. జరిగిందంతా విన్న శ్రీ మహావిష్ణువు.. నేను ఈ రావిచెట్టు లోనే నిత్యం కొలువై ఉంటాను. కాబట్టి నువ్వు నిర్భయంగా ఇక్కడే ఉండొచ్చు అని జేష్టాదేవి కి శ్రీమహావిష్ణువు మాట ఇస్తాడు.

రావిచెట్టు బయట ఎక్కడ కనిపించినా సరే ఒక చెంబుడు నీళ్ళు పోసి.. మనసారా ధ్యానిస్తే.. శ్రీమహావిష్ణువు అనుగ్రహం మనపై పరిపూర్ణంగా లభిస్తుంది. అయితే ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని హిందువులు భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఆవు నేతితో దీపాన్ని వెలిగించి.. పూజలు మొదలుపెడతారు. దీపాన్ని వెలిగించే సమయంలో దీపం పెట్టే ప్రమిద కింద.. ఒక రావి ఆకును పెట్టి దీపాన్ని వెలిగిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు వెంటనే లభిస్తుంది. అయితే ఈ ప్రమీద కింద రాగి ఆకులు పెట్టేటప్పుడు ఆకు కాడ దేవుని పటాలు వైపు.. ఆకు చివరి భాగం మన వైపు ఉండేలా పెట్టాలి. ఆ తర్వాత ద్వీపం వెలిగించాలి. తొలి ఏకాదశి రోజున ఈ విధంగా దీపం వెలిగించడం వల్ల.. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మీ జాతకంలో ఉన్న కుజదోషం.. గ్రహాల యొక్క చెడు ప్రభావం.. తొలగిపోయి ఆ శ్రీమహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది…
Please Read Disclaimer