ఇంటికి నిప్పుపెట్టిన కుక్క.. నిఘా కెమేరాకు చిక్కిన దృశ్యం

0

ఇంట్లో కుక్కలను వదిలి బయటకు వెళ్తున్నారా? అయితే, జాగ్రత్త అవి ఏమైనా చేయొచ్చు. మీ ఇంటికి నిప్పు పెట్టే ప్రమాదం కూడా ఉంది. అదేలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, యూట్యూబ్‌లో వైరల్‌గా చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూడాల్సిందే.

కుక్కలు ఏ వస్తువు పడితే ఆ వస్తువు నమిలేస్తాయనే సంగతి తెలిసిందే. డేనియల్ డానిష్ అనే వ్యక్తి పెంచుతున్న కుక్క కూడా అదే చేసింది. అయితే, నమిలింది ఏమిటో తెలుసా? సిగరెట్ వెలిగించే లైటర్. ఆ కుక్కకు అది ఎక్కడ దొరికిందో ఏమో. దాన్ని నోట కరుచుకుని సోఫా మీదకు తీసుకెళ్లింది. దాన్ని నములుతుంటే.. ఒక్కసారిగా దాని నుంచి మంటలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత మంటలు గది అంతా వ్యాపించాయి. ఇంట్లో నుంచి పొగలు రాగానే ఎమర్జెన్సీ అలారం మోగింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది సమయానికి అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటన సీసీటీవీ కెమేరాలో రికార్డైంది.
Please Read Disclaimer