మాయదారి రోగం మృతదేహాలను పీక్కుతిన్న కుక్కలు

0

కరోనా కల్లోలం ఘోరాలు చేస్తోంది. మానవత్వాన్ని చంపేస్తోంది. మనుషులను బంధాలకు దూరం చేస్తోంది. కరోనాతో చనిపోతే కనీసం చివరి చూపు కూడా చూడడం లేదు. వారిని అనాథ శవాల్లా వదిలేస్తున్నారు. తమకూ కరోనా సోకుతుందని స్థానిక ప్రజలు కూడా కరోనా మృతదేహాలను ఖననం చేయకుండా అడ్డుకుంటున్నారు.

కరోనా మానవత్వాన్ని చంపేసిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. స్థానిక ఎర్రగడ్డ ఆస్పత్రిలో కరోనాతో మరణించిన వారి మృతదేహాలను పూర్తిగా కాల్చకుండానే కాటి కాపరులు బంధువులు వ్యాపిస్తుందనే భయంతో వదిలేసి వెళ్తున్నారు. దీంతో సగం కాలిన శవాలను కుక్కలు పీక్కుతిన్న భయానక పరిస్థితి హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఈ పరిణామం అందరినీ కలిచివేస్తోంది.

కరోనాతో చనిపోయిన శవాలు కావడంతో కాటి కాపరులే కాదు.. బంధువులు తమకూ సోకుతుందని వాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. కాలిందో కాలలేదో చూడకపోవడంతో సగం కాలి అలాగే ఉండిపోతున్నాయి. వర్షాకాలం కావడంతో తేమ వానకు సరిగా కాలడం లేదు. వాటిని కుక్కలు పీక్కుతింటున్నాయి. ఈ అమానవీయ సంఘటనలు ఇంకా కరోనాతో ఎన్ని చూడాల్సి వస్తుందో ఊహించుకోవడానికే భయంగా ఉంది.