దేశంలో తొలి గాడిద పాల డెయిరీ.. లీటర్ రూ.6వేలు

0

పాలు సంపూర్ణ ఆహారం. రోజు తాగితే ఆరోగ్యానికి మంచింది. పెద్దలు పిల్లలు దేశంలో రోజూ తాగేస్తుంటారు. భారత్ లో ఆవు గేదె పాలను మాత్రమే తాగుతారు. అందుకే వీటికి మాత్రమే డెయిరీలుంటాయి. అర లీటర్ రూ.25వరకు మార్కెట్లో దొరుకుతున్నాయి.

ఇటీవలే దేశంలో తొలిసారిగా గాడిద పాల డెయిరీ ఏర్పాటవుతోంది. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వెన్స్ (ఎన్ఆర్సీఈ) త్వరలో హర్యానాలోని హిస్సార్ లో గాడిద పాల డెయిరీని ప్రారంభించనుంది. హలారి జాతి గాడిద నుంచి సేకరించిన పాలతో ఈ డెయిరీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం పదివేల హలారి జాతి గాడిదలను ఎన్ఆర్సీఈ తెప్పించింది. ప్రస్తుతం ఈ గాడిదలు సంతోనోత్పత్తిలో ఉన్నాయి.

కాగా గుజరాత్ లోని హాలరీ జాతి గాడిదల పాలు లీటర్ కు ఏకంగా రూ.6వేలు పలుకుతున్నాయి. పోషకాలు ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు జనాలు ఎగబడి మరీ ఆ పాలను కొంటున్నారు. దాదాపు బంగారు వర్ణంలో ఉండే హాలరీ జాతి గాడిదల పాలలో పోషక విలువలు అత్యధికంగా ఉండడంతో ఇంత డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

గాడిద పాలు మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఎన్నో ఆయుర్వేద మందుల తయారీలోనూ గాడిద పాలను వాడుతారు. ముఖ్యంగా హలారి జాతి గాడిద పాలను ఔషధాల్లో ఎక్కువగా వినియోగిస్తారు.

గాడిద పాలకు క్యాన్సర్, ఉబకాయం, అలర్జీ వంటి వ్యాధులపై పోరాడే సామర్థ్యం ఉంది. ఇందులో యాంటీ యాక్సిడెంట్, యాంటీఏజింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

అంతేకాదు గాడిద పాలతో తయారు చేసే సౌందర్య ఉత్పత్తులు చాలా ఖరీదైనవి. సబ్బులు.. లిప్ బామ్ లు.. బాడీ లోషన్లను తయారు చేసేందుకు ఈ గాడిద పాలను వినియోగిస్తారు. అందుకే హలారి గాడిద పాలు మార్కెట్లో రూ.2వేల నుంచి రూ.7వేల వరకు ధర పలుకుతున్నాయి.