సెక్స్ సామర్థ్యం పెంచే డ్రగ్స్.. సిటీలో జోరుగా విక్రయాలు

0

హైదరాబాద్ లో డ్రగ్స్ దందా ఎప్పటి నుంచో జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే.టాలీవుడ్ లోనూ డ్రగ్స్ మూలాలు బయటపడి పలువురు సినీ ప్రముఖులు సైతం విచారణ ఎదుర్కొన్నారు. గోవా సహా కొన్ని నగరాల నుంచి ఇప్పటికీ డ్రగ్స్ హైదరాబాద్ చేరుతోందని పోలీసుల విచారణల్లో వెల్లడైంది.

ఇప్పుడు హైదరాబాద్ లో డ్రగ్స్ పట్టుబడడం మామూలైపోయింది. అయితే ఈసారి కొత్త తరహా డ్రగ్స్ పట్టుబడడం విశేషంగా మారింది. ఈ డ్రగ్స్ వాడితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందంటూ నగరంలో జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పబ్ లకు వచ్చే వాళ్లను టార్గెట్ చేసి ఈ అమ్మకాలు సాగిస్తున్నారట.. పెద్ద ఎత్తున డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్నట్టు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కనిపెట్టారు.

తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి దగ్గర 200 గ్రాముల మత్తు మందు మెఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి తీసుకొని వీరు హైదరాబాద్ లో అమ్ముతున్నట్టు గుర్తించారు.

హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్ లో పనిచేసిన చెఫ్ సలీమ్ ఇందులో సూత్రదారిగా గుర్తించారు. ఇక టెలి మార్కెటింగ్ చేస్తున్న ముగ్గురిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.