Templates by BIGtheme NET
Home >> Telugu News >> దుబ్బాక ఎగ్జిట్ పోల్స్

దుబ్బాక ఎగ్జిట్ పోల్స్


తెలంగాణ లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య యుద్ధంలా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది. ఓటర్లు విజేతలు ఎవరో ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు సాగిన పోలింగ్ కు దుబ్బాక ప్రజలు భారీగా తరలివచ్చారు. క్యూలల్లో నిలబడి మరీ ఓటు వేసి చైతన్యాన్ని చాటారు.

దుబ్బాకలో పోలింగ్ ముగిసే సమయాని కి 82శాతం పోలింగ్ నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని ఎన్నికల అధికారులు ప్రకటించారు. పోలింగ్ ముగిసిన అనంతరం పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ (నాగన్న) సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో టీఆర్ఎస్ విజయ భేరీ గెలుస్తుందని అంచనా వేసింది. 51-54 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు తొలిస్థానం లభించగా.. 33-36 శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ కు రెండో స్థానం వస్తుందని తెలిపింది. 8-11 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస రెడ్డి కి మూడో స్థానం లభించనున్నట్లు పేర్కొంది.

పొలిటికల్ ల్యాబోరేటరీ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. 47 శాతం ఓట్లతో బీజేపీకి మొదటి స్థానం రానున్నట్లు పేర్కొంది. తర్వాత 38 శాతం ఓట్లతో టీఆర్ఎస్కు రెండోస్థానం కాంగ్రెస్కు 13 శాతం ఓట్లు రానున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది.

*ఈనెల 10న తేలనున్న భవితవ్వం
దుబ్బాక ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత పోటీ పడగా.. కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్రెడ్డి.. బీజేపీ నుంచి రఘునందన్రావు పోటీ చేశారు. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.