ఇండియా అంటే అంత చులకనా మేధావీ!

0

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్ చైనాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. చైనా పొరుగునే ఉన్న మన భారత దేశం దీన్ని సమర్థంగానే ఎదుర్కొంటోంది. దేశంలో ఇప్పటివరకు 73 కేసులు నిర్ధారణయ్యాయి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి నిరోధానికి సమర్థమైన చర్యలు చేపడుతున్నాయి. అయితే బ్రిటన్కు చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త జిమ్ ఓ నీల్ మాత్రం కరోనా వైరస్ విషయంలో భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చైనా కంటే ముందు భారత్లో ఈ వైరస్ వచ్చి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు.

జిమ్ ఓ నీల్ గతంలో గొల్డ్మన్ సాక్స్కు నేతృత్వం వహించారు. బ్రిక్స్(BRICS) అనే పదాన్ని తొలుత ప్రయోగించింది కూడా ఆయనే. అలాంటి వ్యక్తి బాధ్యత మరిచి ఒక దేశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనా కట్టడిలో చైనా చాలా వేగంగా యుద్ధప్రాతిపదికన స్పందించిందంటూ పొగడ్తల వర్షం కురిపించిన ఆయన భారత్ లో తొలుత కరోనా వెలుగు చూసి ఉంటే అక్కడి ప్రభుత్వం చైనాలా ప్రతిస్పందించేది కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా.. పాశ్చాత్య దేశాలు కూడా చైనాను అనుసరించాలని సూచించారు. ‘‘కరోనా వైరస్ భారత్లో వెలుగు చూడనందుకు భగవంతుడికి ధన్యావాదాలు చెప్పాలి. అదే జరిగి ఉంటే చైనా స్థాయిలో భారత్ లో ఎన్నటికీ ముందుకు కదిలేది కాదు. అక్కడ ప్రభుత్వం కార్యకలాపాల స్థితి అలాంటిది. బహుశా.. చైనా పద్ధతుల్లోని మంచి ఇదేనేమో. ఆ మాట కొస్తే బ్రెజిల్ విషయంలోనూ ఇదే వాస్తవం.’ అని జిమ్ వ్యాఖ్యానించారు. జిమ్ వ్యాఖ్యల పట్ల భారత్ తీవ్రంగానే స్పందించింది. భారత్ హై కమిషనర్ విశ్వేశ్ నెగీ దీనిపై స్పందిస్తూ జిమ్వి బాధ్యతారిహితమైన వ్యాఖ్యలని మండిపడ్డారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-