బీజేపీలోకి చేరిన టీడీపీ రెబెల్!

0

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీపై ఇది వరకే తిరుగుబావుటా ఎగరేసిన ఈదర హరిబాబు ఎట్టకేలకూ బీజేపీలోకి చేరారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీపై తిరుగుబాటు చేసిన వారిలో ఈదర ఉన్నారు. ప్రకాశం జిల్లాలో డక్కామొక్కీలు తిని గతంలో తెలుగుదేశం పార్టీ జడ్పీ చైర్మన్ పదవిని సొంతం చేసుకుంది.

అక్కడ మెజారిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినా చైర్మన్ గిరిని మాత్రం టీడీపీ సొంతం చేసుకుంది. అలా కొంత కాలం సాగిన తర్వాత ఈదర హరిబాబు సొంత పార్టీ పై తిరుగుబాటు చేశారు.

స్వతంత్రుడిగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతును ఇచ్చింది. కొంతమంది సొంత వర్గం జడ్పీటీసీలు కూడా ఆయనకు మద్దతు ఇవ్వడంతో ఆయన చైర్మన్ గిరిని సొంతం చేసుకున్నారు. అలా టీడీపీ రెబెల్ గా విజయం సాధించిన ఈదర బీజేపీలోకి చేరే ప్రయత్నంలో ఉన్నారు గత కొన్నాళ్ల నుంచి.

ఇప్పుడు అందుకు సంబంధించిన లాంఛనం పూర్తి అయ్యింది. అధికారం కోల్పోవడంతో పలువురు తెలుగుదేశం నేతలు బీజేపీ వైపు చేరిపోతూ ఉన్న క్రమంలో టీడీపీకి రెబెల్ గా వ్యవహరించిన ఈదర కూడా ఆ పార్టీ దారిలో నడిచారు. కమలం పార్టీలోకి చేరిపోయారు.
Please Read Disclaimer