నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. ఈ రాశులవారికి దోషం.. పరిహారాలివే!

0

డిసెంబరు 26 గురువారం నాడు మూల నక్షత్రం ధనస్సు రాశిలో కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణ స్పర్శకాలం ఉదయం 8.03 గంటలు కాగా, మోక్షకాలం ఉ.11.11 గంటలు. మూడు గంటల పాటు ఉండే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారత్‌తోపాటు ఆసియాలోని పలుదేశాల్లో కనువిందు చేయనుంది. సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆలయాలను బుధవారం రాత్రి నుంచి మూసివేసి, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అభిషేకం, సంప్రోక్షణ తర్వాత పునఃప్రారంభిస్తారు. ధనుస్సు రాశి వారు ఈ గ్రహణం చూడరాదని, ముఖ్యంగా మూల నక్షత్రం వారు ఈ గ్రహణం చూస్తే అనారోగ్య హేతువని జ్యోతిషులు తెలియజేస్తున్నారు.

గ్రహణం ఏ రాశి లో సంభవిస్తుందో ఆ రాశి వారికి దోషం అని ధర్మ శాస్త్రం, అనారోగ్యానికి కారణమవుతుందని జ్యోతిష పండితులు వివరిస్తున్నారు. కాబట్టి దోష పరిహారాలు చేసుకొవాలని తెలుపుతున్నారు. పై జాతక రాశి వారు బ్రాహ్మణులకు దానాలు ఇవ్వాలి. పరిహారాలు మూడు విధాలుగా చేయవచ్చని సూచిస్తున్నారు. ఉత్తమం, మధ్యమం, అధమం. ఈ దానం గ్రహణం విడిచిన తరువాతే చేయాలని, దానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలని అంటున్నారు.

ప్రథమం (ఉత్తమం)
బంగారంతో చేయించిన సూర్య బింబం, వెండి నాగ సర్పాన్ని రాగి లేదా కంచు పాత్రలో పెట్టి నిండుగా ఆవు నెయ్యి, కిలోంపావు నల్లని నువ్వులు, తెల్లని పంచె సమంత్రకంగా వేదవిదులైన బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలని పేర్కొన్నారు.

దాన సమయంలో చెప్పాల్సి సంకల్పం

ధనుస్సు రాశి: మమ జన్మజాతక ధనుః రాశ్యాత్ తత్రాపి మూలా నక్షత్రే స్వజన్మ నక్షత్రే కేతు గ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.

వృషభ రాశి: మమ జన్మజాతక వృషభ రాశ్యాత్ అష్టమ స్థానే ధనుః రాశ్యాం మూలా నక్షత్రే కేతు గ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.

కన్య రాశి: మమ జన్మజాతక కన్యా రాశ్యాత్ అర్థాష్టమ స్థానే ధనుః రాశ్యాం మూలా నక్షత్రే కేతు గ్రస్త సంపూర్ణ సూర్య గ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.

మకర రాశి: మమ జన్మజాతక మకర రాశ్యాత్ ద్వాదశ స్థానే ధనుః రాశ్యాం మూలా నక్షత్రే కేతు గ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణ సమయే సంప్రాప్త సర్వారిష్ట శాంత్యర్ధం.
ఆజ్య పూరిత కాంశ్య పాత్రే రజత సర్ప యుత ప్రత్యక్ష సువర్న జ్యోతి సహిత సౌర బింబదానం కరిష్యే

ద్వితీయ పరిహారం (మధ్యమం)

పై పరిహారం అవకాశం లేని వారు మహాన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం చేయించాలి. కేజీంపావు ఉలవలు, గోధుమలు, తెల్లని పంచె దానం చేయాలి.

తృతీయ పరిహానం (అధమం)

పై పరిహారం కూడా అవకాశం లేనివారు మూడు నెలల పాటు శివ కవచ స్తోత్రం ప్రతి రోజు పారాయణం చేయాలని పండితులు పేర్కొంటున్నారు.
Please Read Disclaimer