గున్నను రక్షించిన సిబ్బందికి కృత‌జ్ఞతలు చెప్పిన ఏనుగు, వీడియో వైరల్

0

ఏనుగులు తమ కుటుంబానికి ఎంతో విలువనిస్తాయి. తమ పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. వాటికి ఏ చిన్న ఆపద వచ్చినా మనుషుల్లాగే తల్లడిల్లిపోతాయి. తమ పిల్లలపై వాటికి ఉన్న మమకారం ఏ పాటిదో చెప్పేందుకు ఈ వీడియోనే నిదర్శనం. ఓ అటవీ ప్రాంతంలో గుంపుతో కలిసి వెళ్తున్న ఓ గున్న ఏనుగు ప్రమాదవశాత్తు పెద్ద గోతిలో పడిపోయింది.

ఆ గున్నను రక్షించేందుకు తోటి ఏనుగులు ఎంతో ప్రయత్నించాయి. చివరికి సాధ్యం కాలేదు. ఈ ఘటనను చూసిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు ప్రొక్లయినర్‌తో సహా అక్కడికి చేరుకున్నారు. వారిని చూడగానే ఏనుగులు.. పక్కకు తప్పుకున్నాయి. దీంతో సిబ్బంది ఆ గోతిలోని మట్టిని పక్కకు తొలగిస్తూ ఆ గున్న ఏనుగు బయటపడేందుకు దారి ఏర్పాటు చేశారు. అయితే, మట్టి వదులుగా ఉండటంతో ఆ గున్న ఏనుగు పైకి చేరలేక ఇబ్బంది పడింది. దీంతో సిబ్బంది మరికొంత మట్టిని వెనక్కి తీయడంతో ఆ గున్న ఏనుగు సులభంగా పైకి చేరింది.

ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఆ ఏనుగులు.. గున్న ఏనుగు బయటకు రాగానే దాని వద్దకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా తల్లి ఏనుగు అటవీ సిబ్బంది వైపు తిరిగి తొండం ఎత్తి కృత‌జ్ఞతలు తెలపింది. ఈ వీడియోను ప్రవీణ్ కశ్వాన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఆ వీడియోను మీరూ చూసేయండి మరి.

వీడియో: