మాజీ సీఎం కొడుకు అనుమానాస్పద మృతి ..హత్య ?ఆత్మహత్య !

0

అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ కుమారుడు శుబాన్సో యూకేలో నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ లో శవమై కనిపించారు. కెనడా విశ్వవిద్యాలయంలో చదువుతున్న షుబన్సో ఫుల్ (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీనితో ఇప్పటికే పెద్ద దిక్కుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ ఇంట్లో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. 2016లో కలిఖో ఫుల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

శుబాన్సో మాజీ సీఎం కలిఖో పుల్ కు మొదటి భార్య సంతానం. శుబాన్సో గత కొన్ని రోజులుగా యూకేలోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో బ్రైటన్ లోని ఓ అపార్టుమెంట్ లో శుబాన్సో మృతదేహం అనుమానాస్పద స్థితి లో లభ్యమైంది. శుబాన్సో మృత దేహాన్ని స్వదేశానికి తీసుకు రావటానికి అతని కుటుంబ సభ్యులు యూకేలోని హైకమిషణ్ ఆఫ్ ఇండియా తో మాట్లాడుతున్నారు.

ఇకపోతే కలిఖో పుల్ జులై 20 1969 నుంచి ఆగస్టు 9 2016 వరకు రాజకీయాల్లో కొనసాగారు. 2016 వరకు ఆయన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. హయులియంగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఈయన ఎన్నిక అయ్యారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డావంటూ కలిఖో పుల్ కి 2015 ఏప్రిల్ లో షో కాజ్ నోటీసు కూడా యివ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఫుల్ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించడంతో 19 ఫిబ్రవరి 2016న 30మంది రెబెల్ ఎమ్మెల్యేలు బీజేపీ మద్దతుతో కలిసి ముఖ్యమంత్రి పదవి ని చేపట్టారు. అయితే ఈ నియామకానికి వ్యతిరేకం గా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆవేదన కు లోనైన ఫుల్ ఆగస్టు 9 2016 న నీతి విహార్లోని తన అధికారిక నివాసం లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Please Read Disclaimer