సాకర్ దిగ్గజానికి కరోనా..వైరల్ గా అతడి భార్య ఆవేదన

0

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పటికే లక్షలాది మందికి సోకి… వేలాది మంది ప్రాణాలను బలిగొంది. ఈ వైరస్ కారణంగా కుటుంబ సభ్యుల మధ్య అంతరం పెరిగిపోతోంది. చనిపోయిన కుటుంబ సభ్యుడిని కడసారి చూసుకునేందుకు కూడా వీలుపడని సందర్భాలనూ చూస్తున్నాం. అలాంటి కరోనా… ఇప్పుడు ఫుట్ బాల్ క్రీడాకారుడిని తన సతీమణికి దూరం చేసింది. అతడిడో ఎడబాటు తట్టుకోలేని అతడి సతీమణి… ఇన్ స్టాగ్రాం వేదికగా చేసిన ఓ కామెంట్ వైరల్ అయిపోయింది. కరోనా కష్టాలకు సంబంధించి ఇప్పటిదాకా చాలా కామెంట్లే వచ్చినా… ఈ కామెంట్ అన్నింటినీ కిందకు తోసేసి ఫస్ట్ ప్లేస్ లో కూర్చుందని చెప్పక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఆ కామెంట్ – దానికి దారి తీసిన సందర్భాలు – కామెంట్ చేసిన ఫుట్ బాల్ క్రీడాకారుడి సతీమణి – అసలా ప్లేయర్ ఎవరు? అన్న వివరాల్లోకి వెళితే… సాకర్ లో దిగ్గజ దేశ జట్టుగా పేరొందిన అర్జెంటీనాకు చెందిన మిడ్ ఫీల్డర్ ఎజ్విక్వైల్ గారే (33)కు కరోనా సోకింది. లా లీగా లీగ్లో వెలెన్సియా తరఫున ఆడుతున్న గారే కరోనా బారిన పడ్డాడు. దాంతో అతన్ని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ‘ఈ ఏడాది దుర్ముహూర్తంలో ప్రారంభమైంది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న నాకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నా’ అని గారే తెలిపాడు. స్పెయిన్ లో జరగాల్సిన ఉన్న లా లీగాకు కూడా కరోనా సెగ తగలడంతో దాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గారేకు కరోనా వైరస్ సోకింది.

స్పెయిన్ లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 9190 కరోనా కేసులు నమోదవగా.. అందులో 300కి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఎజ్విక్వైల్ గారే కరోనా బారిన పడటంతో అతని భార్య తమరా గోర్రో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గారేను ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో క్వారంటైన్(నిర్భంధం)లో ఉంచిన ఫొటోను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ‘‘కరోనా మనిద్దరికీ అడ్డుగోడలా నిలిచి సెపరేట్ చేసింది. క్వారెంటైన్ లో నువ్వు – బయట నేను’’ అంటూ ఆమె భావోద్వేగ ఫోటో పెట్టారు. అభిమానుల హృదయాల్ని గెలుచుకున్న ఈ ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం గారే పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-